ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు
శంషాబాద్ రూరల్: పోలీసు విధులకు ఆటంకం కలిగించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై శంషాబాద్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి వద్ద సోమవారం పట్టుబడిన పశువులను మండలంలోని బుర్జుగడ్డతండా వద్ద ఉన్న సత్యం శివం సుందరం గోశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడకు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో విధులకు ఆటంకం కలిగించారని ఐపీసీ సెక్షన్–186 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.