‘పరస్పర సహకారం’పై విచారణ
డీసీఓ చక్రధర్
హన్మకొండ అర్బన్ : జిల్లా సహకార శాఖలో అక్రమ డిప్యూటేషన్లపై ‘పరస్పర సహకారం’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. మొత్తం డిప్యూటేషన్లపై విచారణ చేసి... రద్దు చేస్తామని జిల్లా సహకార అధికారి చక్రధర్ తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు జరిగినట్లు గుర్తించామన్నారు. అవసరంలేకున్నా డిప్యూటేషన్లు చేసిన విషయంలో ఆరా తీస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.