District Co-operative Marketing Society
-
‘డీసీఎంఎస్’ సమావేశం వాయిదా
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) చైర్మన్ ఐర నారాయణరెడ్డిపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో సోమవారం జరుగనున్న ప్రత్యేక సమావేశం వాయిదా పడింది. ఏడుగురు డెరైక్టర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు డీసీఎంఎస్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని జిల్లా సహకార అధికారి సూర్యచంద్రరావు నిర్ణయించారు. ఈ మేరకు డెరైక్టర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో ైచైర్మన్ నారాయణరెడ్డి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో నిర్వహించ తలపెట్టిన ప్రత్యేక సమావేశాన్ని వాయిదా వేసేలా కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాల కాపీని శనివారం డీసీవో కార్యాలయం నోటీసు బోర్డులో స్వయంగా నారాయణరెడ్డి అతికించారు. అలాగే ఆదివారం డీసీవో కార్యాలయానికి వెళ్లి సూపరింటెండెంట్ ఆత్మారాంకు కూడా కోర్టు ఉత్తర్వుల కాపీని అందజేశారు. న్యాయస్థానం ఆదేశాలు అధికారికంగా ఆదివారం సాయంత్రం తమకు అందాయని.. ఈ మేరకు సోమవారం నిర్వహించ తలపెట్టిన ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జిల్లా సహకార అధికారి సూర్యచంద్రరావు ‘సాక్షి’ప్రతినిధితో తెలిపారు. పక్షం రోజులుగా క్యాంపులు డీసీఎంఎస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన డెరైక్టర్లు పక్షం రోజులుగా క్యాంపులో ఉన్నారు. ఏడుగురు సభ్యులు హైదరాబాద్, శ్రీశైలం, మహారాష్ట్రలో గడిపారు. ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం ఈ ఏడుగురు సభ్యులు నేరుగా డీసీఎంఎస్ కార్యాలయానికి వచ్చే అవకాశాలున్నాయి. డీసీఎంఎస్ చైర్మన్ రేసులో తాంసి మండలం జామిడి పీఏసీఎస్ చైర్మన్ వినోద్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనకు మంత్రి జోగు రామన్న, నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి ఆశీస్సులున్నాయి. పావులు కదుపుతున్న మంత్రి, ఐకే రెడ్డి? డీసీఎంఎస్ చైర్మన్ నారాయణరెడ్డిపై అవిశ్వాసం విషయంలో నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత చైర్మన్ నారాయణరెడ్డి ఒకప్పుడు ఐకేరెడ్డి అనుచరుడే. రెండు పర్యాయాలు నారాయణరెడ్డి డీసీఎంఎస్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. మొదటిసారి ఇంద్రకరణ్‌రెడ్డే చొరువ చూపి నారాయణరెడ్డిని డీసీఎంఎస్ చైర్మన్ అయ్యేలా చక్రం తిప్పారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో నారాయణరెడ్డి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డికి దగ్గరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన మహేశ్వర్‌రెడ్డికి మద్దతిచ్చారు. దీంతో నారాయణరెడ్డిపై పెట్టిన అవిశ్వాసం విషయంలో వినోద్‌రెడ్డికి అనుకూలంగా ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక చొరువ చూపుతున్నట్లు తెలుస్తోంది. -
బల పరీక్ష
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)ల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లపై డెరైక్టర్లు తిరుగుబావుటా ఎగురవేయడం, అవిశ్వాసానికి నోటీసులు జారీ చేయడంతో బలపరీక్ష అనివార్యంగా మారింది. ఈ మేరకు డీసీవో సూర్యచంద్రరావు అధ్యక్ష ఎన్నికపై చర్చ, బలపరీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 7న డీసీసీబీ, 11న డీసీఎంఎస్ అవిశ్వాస తీర్మానాలపై ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. డీసీసీబీలో 21 మంది డెరైక్టర్లు ఉండగా, 11 మంది సభ్యులు హాజరైతే కోరం సరిపోతోంది. 2/3 వంతు(14 మంది) మెజార్టీతో ఎన్నిక జరుగుతుంది. చెయ్యెత్తే విధానంతో ఓటింగ్ ఉంటుంది. డీసీఎంఎస్‌కు డెరైక్టర్లు 10 మంది, సభ్యులు 10 మంది ఉంటారు. కోరం ఆరుగురు, కాగా 2/3 వంతు (7 గురు) సభ్యులతో ఓటింగ్ విధానంతో ఎన్నికలు జరుగుతాయి. ఇందులో మెజార్టీ ఓట్లతో గెలుపోటములు ప్రకటిస్తారు. పీఏవైసీ(ప్రాథమిక) వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షుల మీద ఆ సంఘాల డెరైక్టర్లు ఆవిశ్వాసం ప్రవేశ పెట్టడంతో వాటికి కూడా ప్రత్యేక సమావేశాలు ప్రవేశపెట్టారు. ఆగస్టు 12న సారంగాపూర్ మండల కౌట్ల(బి), 13న మంజులాపూర్, బజార్‌హత్నూర్‌లలో ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. వేడెక్కిన సహకార రాజకీయం అవిశ్వాస తీర్మానాల నేపథ్యంలో సహకార రాజకీయం వేడెక్కింది. ఎవరి నోట విన్న జిల్లాలో సహకార చర్చ జోరుగా సాగుతోంది. చైర్మన్ గిరిలను వశం చేసుకోవడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రం సహకార బ్యాంకుల్లో 21 మంది డెరైక్టర్లు ఉండగా అందులో ఒకరు రాజీనామా చేశారు. మిగిలిన 20 మందిలో 11 మంది డెరైక్టర్ల సంతకాలతో జిల్లా సహకార అధికారి సూర్యచందర్కు అవిశ్వాస తీర్మానం అందించారు. ఈ అవిశ్వాస తీర్మాన పత్రాన్ని హైదరాబాద్‌లోని సహకార కమిషనర్ కార్యాయానికి పంపించారు. అవిశ్వాస తీర్మానం పై సంతకాలు చేసిన 11 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడంలో కీలకపాత్ర పోషించిన డీసీసీబీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి వైపు 11 మంది ఉన్నట్లు ఆ వర్గీయులు చెబుతున్నారు. ఈ ఓటింగ్‌లో విజయం సాధించాలంటే మరో ముగ్గురు సభ్యులు అవసరం ఉంది. వారికోసం ప్రయత్నాలు ముమ్మర ం చేస్తున్నారు. ప్రస్తుత డీసీసీబీ అధ్యక్షుడు తన పదవిని కాపడుకునెందుకు తన దైన శైలిలో పావులు కదుపుతున్నారు. పార్టీని వీడేందుకు కూడా డీసీసీబీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. అనంతరం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు, టీఆర్ఎస్లోని ముఖ్య నాయకులతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. -
సీడీసీఎంఎస్ ఆస్తులు అన్యాక్రాంతం
చిత్తూరు జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (సీడీసీఎంఎస్) ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. పాలకవర్గాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు(గిరింపేట), న్యూస్‌లైన్: రైతుల అభ్యున్నతి కోసం 1946లో చిత్తూరులోని గాంధీరోడ్డులో సొంత భవనంలో చిత్తూరు జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (సీడీసీఎంఎస్)ని స్థాపించారు. రైతాంగానికి అవసరమైన రుణాలను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అందిస్తోంది. దీనికి అనుసంధానంగా ఎరువులు, క్రిమిసంహారక మందు లు, విత్తనాలను అందించే ఉద్దేశంతో సీడీసీఎంఎస్‌ను స్థాపించారు. దీని లావాదేవీలు కొన్నేళ్లు సజావుగా సా గాయి. తర్వాత పాలకులు, పాలకవర్గాల స్వార్థం, అధికారుల ఉదాసీనత కారణంగా సీడీసీఎంఎస్ పాలన గాడి తప్పింది. ఖరీదైన ఆస్తులపై నేతల కన్ను సీడీసీఎంఎస్కు చిత్తూరు, మురకంబట్టు, పూతలపట్టు, పుంగనూరు, పలమనేరు, మదనపల్లె, హార్సిలీహిల్స్, వాల్మీకిపురం, కలికిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, పాకాల తదితర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే భవనాలు, అతిథి భవనాలు, హోటళ్లు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. చిత్తూరులో ప్రధాన కార్యాలయం పక్కనే పెద్ద గోడౌన్ ఉంది. మురకంబట్టు వద్ద జాతీయ రహదారికి పక్కనే కోట్లాది రూపాయల విలువైన స్థలం, పాత భవనాలు ఉన్నాయి. ఇక్కడున్న గోడౌన్, ఖాళీ స్థలాన్ని ఏదో ఒక రూపం లో నొక్కేయాలనే ఆలోచన మాజీ పాల కవర్గానికి చెందిన ముఖ్య నాయకుడికి కలిగింది. మార్కెట్లో ప్రస్తుత మున్న రేటు ప్రకారం దీని విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. అయితే వందేళ్ల లీజు పేరుతో దీన్ని నొక్కేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతిలో ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా అత్యంత ఖరీదైన భవనం ఉంది. దీనికి నిన్నమొన్నటి వరకు రూ.12 వేలు మా త్రమే అద్దె వసూలు చేసుకునే విధంగా అధికారులపై పాలకవర్గం ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీనిపై పత్రికల్లో కథనాలు వెలువడడంతో రూ.12 వేలు కాస్త రూ.1.2 లక్షలకు పెరిగింది. ఇదీ తక్కువేనని చెప్పవచ్చు. బహిరంగవేలం ప్రకటిస్తే నెలకు నాలుగైదు లక్షల రూపాయల అద్దె వచ్చే పరిస్థితి నెలకొంది. అ యినా పాలకవర్గం తమకు కావాల్సిన వారి కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి అద్దెను కట్టడి చేస్తున్నట్లు సమాచారం. ఇలా జిల్లాలోని సీడీసీఎంఎస్ ఆస్తులు తరిగిపోయేలా పాలకులు వ్యవహరిస్తు న్నా అధికారులు నోరు మెదపడం లే దనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గోడౌన్ అద్దెలో మతలబేంటి? సీడీసీఎంఎస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న గోడౌన్‌ను అద్దెకివ్వడంలో మతలబేంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. దీని అద్దె రూ.30 వేలకుపైనే ఉంటుంది. దీన్ని రూ.12 వేల అద్దెకే కట్టబెడుతూ మాజీ పాలకవర్గం తీర్మానించింది. అంతేకాకుండా ఎక్కువ కాలం అద్దెకు ఇచ్చే విధంగా తీర్మానాన్ని ఆమోదిం చింది. ప్రస్తుతం ఎక్కువ చెల్లించేందుకు వ్యాపారులు ముందుకొస్తున్నా అద్దెకు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గోడౌన్ అందుబాటులో లేని కారణంగా ఎరువు లు, విత్తనాల అమ్మకాల కోసం కార్యాలయ భవనాన్ని సిబ్బంది వాడుకుంటున్నారు. కారు షెడ్లో ఎరువులు, ప్ర ధాన కార్యాలయంలో వేరుశెనగ విత్తనాలను విక్రయిస్తున్నారు. వీటిపై సీడీసీఎంఎస్ మేనేజర్ వెంకటమునిరెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా పాలకవర్గాల తీర్మానాలను కాదని తామేమీ చేయలేమన్నారు. అయితే ఆస్తులను కా పాడేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చిత్తూరు గోడౌన్ విషయంలో మాజీ పాలకవర్గం తీర్మానా న్ని అమలు చేశామన్నారు. దాన్ని ఖాళీ చేయించాలంటే న్యాయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నామని ఆయన వివరించారు.