చిత్తూరు జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (సీడీసీఎంఎస్) ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. పాలకవర్గాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చిత్తూరు(గిరింపేట), న్యూస్‌లైన్: రైతుల అభ్యున్నతి కోసం 1946లో చిత్తూరులోని గాంధీరోడ్డులో సొంత భవనంలో చిత్తూరు జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (సీడీసీఎంఎస్)ని స్థాపించారు. రైతాంగానికి అవసరమైన రుణాలను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అందిస్తోంది. దీనికి అనుసంధానంగా ఎరువులు, క్రిమిసంహారక మందు లు, విత్తనాలను అందించే ఉద్దేశంతో సీడీసీఎంఎస్‌ను స్థాపించారు. దీని లావాదేవీలు కొన్నేళ్లు సజావుగా సా గాయి. తర్వాత పాలకులు, పాలకవర్గాల స్వార్థం, అధికారుల ఉదాసీనత కారణంగా సీడీసీఎంఎస్ పాలన గాడి తప్పింది.
ఖరీదైన ఆస్తులపై నేతల కన్ను
సీడీసీఎంఎస్‌కు చిత్తూరు, మురకంబట్టు, పూతలపట్టు, పుంగనూరు, పలమనేరు, మదనపల్లె, హార్సిలీహిల్స్, వాల్మీకిపురం, కలికిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, పాకాల తదితర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే భవనాలు, అతిథి భవనాలు, హోటళ్లు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. చిత్తూరులో ప్రధాన కార్యాలయం పక్కనే పెద్ద గోడౌన్ ఉంది. మురకంబట్టు వద్ద జాతీయ రహదారికి పక్కనే కోట్లాది రూపాయల విలువైన స్థలం, పాత భవనాలు ఉన్నాయి. ఇక్కడున్న గోడౌన్, ఖాళీ స్థలాన్ని ఏదో ఒక రూపం లో నొక్కేయాలనే ఆలోచన మాజీ పాల కవర్గానికి చెందిన ముఖ్య నాయకుడికి కలిగింది.
మార్కెట్‌లో ప్రస్తుత మున్న రేటు ప్రకారం దీని విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. అయితే వందేళ్ల లీజు పేరుతో దీన్ని నొక్కేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతిలో ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా అత్యంత ఖరీదైన భవనం ఉంది. దీనికి నిన్నమొన్నటి వరకు రూ.12 వేలు మా త్రమే అద్దె వసూలు చేసుకునే విధంగా అధికారులపై పాలకవర్గం ఒత్తిడి చేసినట్లు తెలిసింది.
దీనిపై పత్రికల్లో కథనాలు వెలువడడంతో రూ.12 వేలు కాస్త రూ.1.2 లక్షలకు పెరిగింది. ఇదీ తక్కువేనని చెప్పవచ్చు. బహిరంగవేలం ప్రకటిస్తే నెలకు నాలుగైదు లక్షల రూపాయల అద్దె వచ్చే పరిస్థితి నెలకొంది. అ యినా పాలకవర్గం తమకు కావాల్సిన వారి కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి అద్దెను కట్టడి చేస్తున్నట్లు సమాచారం. ఇలా జిల్లాలోని సీడీసీఎంఎస్ ఆస్తులు తరిగిపోయేలా పాలకులు వ్యవహరిస్తు న్నా అధికారులు నోరు మెదపడం లే దనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
గోడౌన్ అద్దెలో మతలబేంటి?
సీడీసీఎంఎస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న గోడౌన్‌ను అద్దెకివ్వడంలో మతలబేంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. దీని అద్దె రూ.30 వేలకుపైనే ఉంటుంది. దీన్ని రూ.12 వేల అద్దెకే కట్టబెడుతూ మాజీ పాలకవర్గం తీర్మానించింది. అంతేకాకుండా ఎక్కువ కాలం అద్దెకు ఇచ్చే విధంగా తీర్మానాన్ని ఆమోదిం చింది. ప్రస్తుతం ఎక్కువ చెల్లించేందుకు వ్యాపారులు ముందుకొస్తున్నా అద్దెకు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గోడౌన్ అందుబాటులో లేని కారణంగా ఎరువు లు, విత్తనాల అమ్మకాల కోసం కార్యాలయ భవనాన్ని సిబ్బంది వాడుకుంటున్నారు.
కారు షెడ్‌లో ఎరువులు, ప్ర ధాన కార్యాలయంలో వేరుశెనగ విత్తనాలను విక్రయిస్తున్నారు. వీటిపై సీడీసీఎంఎస్ మేనేజర్ వెంకటమునిరెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా పాలకవర్గాల తీర్మానాలను కాదని తామేమీ చేయలేమన్నారు. అయితే ఆస్తులను కా పాడేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చిత్తూరు గోడౌన్ విషయంలో మాజీ పాలకవర్గం తీర్మానా న్ని అమలు చేశామన్నారు. దాన్ని ఖాళీ చేయించాలంటే న్యాయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నామని ఆయన వివరించారు.
సీడీసీఎంఎస్ ఆస్తులు అన్యాక్రాంతం
Published Sat, Nov 30 2013 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement
Advertisement