District Council
-
మిజోరంలో ఒక్కటైన బీజేపీ, కాంగ్రెస్
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల్లో ప్రధాన వైరి పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చక్మా అటానమస్ డిస్ట్రిక్ కౌన్సిల్(సీఏడీసీ)ను పాలించేందుకు ఒక్కటయ్యాయి. 20 స్థానాలున్న సీఏడీసీకి ఏప్రిల్ 20న జరిగిన ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) 8 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్ 6 సీట్లు, బీజేపీ ఐదు సీట్లలో గెలుపొందాయి. కాగా, ఫుటులి సీటుకు జరిగిన ఎన్నికల ఫలితాలపై గౌహతి హైకోర్టు స్టే విధించడంతో ఫలితాలను వెల్లడించలేదు. సీఏడీసీలో ప్రధాన కార్యనిర్వాహక సభ్యుడిగా తమకు చోటివ్వడానికి ఎంఎన్ఎఫ్ నిరాకరించడంతోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపినట్లు బీజేపీ నేత ఒకరు తెలిపారు. తాజాగా కాంగ్రెస్ మద్దతుతో సీఏడీసీ పాలనను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై ఇరుపార్టీలు ఏప్రిల్ 25న ఓ అంగీకారానికి వచ్చాయన్నారు. త్వరలోనే రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ నిర్భయ్ శర్మతో సమావేశమై సీఏడీసీ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటుపై చర్చిస్తామన్నారు. -
కారుణ్య నియామకాల్లో ఐదురుగురికి అవకాశం
అనంతపురం సిటీ : జిల్లా పరిషత్‌లోని పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఐదుగురికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ నియామక పత్రాలను అందించారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని చైర్మన్ చాంబర్లో జెడ్పీ చైర్మన్ చమన్ నియామక పత్రాలను అందించారు. -
జిల్లాల మంత్రుల సమీక్ష
కడప: పోలీసుల సంక్షేమం కోసం కృషి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కడప జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, పీతల సుజాత, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఇసుక రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, మైనింగ్ ద్వారానే రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. నకిలీ మద్యం అమ్మకాలు అడ్డుకోవాలని అధికారులకు హోమంత్రి చినరాజప్ప సూచించారు.