కృష్ణానదిలో యువకుడు గల్లంతు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. శుక్రవారం ఉదయం ఓ యువకుడు ఉండవల్లి కరకట్టకు సమీపంలో నదిలో ఈత కొడుతుండగా.... అదే సమయంలో నదిలో అక్రమంగా నిలిపి ఉంచిన 50 టన్నుల బరువైన బోటు భారీ గాలివానకు తాడు తెగి అతడిపైకి వెళ్లింది. దీంతో ఆ యువకుడు నదిలో గల్లంతయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.