క్షేత్రస్థాయిలో దివ్యాంగులను గుర్తించడమే లక్ష్యం
సక్షమ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు
నిర్మల్‌రూరల్ : క్షేత్రస్థాయిలో ఉన్న దివ్యాంగులకు గుర్తిం చడమే సమదృష్టి క్షమత వికాస్ ఏవం అనుసంధాన్ మం డల్ (సక్షమ్) ప్రధాన లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని విశ్వబ్రాహ్మ ణ సంఘంలో ఆదివారం జిల్లా సమావేశాన్ని నిర్వహిం చారు. పలు మండలాల అధ్యక్షులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సమగ్ర వికాసం కోసం పనిచేసే జాతీయస్థాయి స్వచ్ఛంద సంస్థ సక్షమ్ అని పేర్కొన్నారు. జిల్లాలో మండలాల వారీగా కమిటీలను నియమించి దివ్యాంగుల వివరాలను తెలుసుకుంటామని అన్నారు.
విభిన్న ప్రతిభగల దివ్యాంగుల ను గుర్తించి వారికి వర్క్‌షాప్‌లను నిర్వహించి ఉపాధి క ల్పించేందుకు సక్షమ్ కృషిచేస్తుందని తెలిపారు. జనవరి 4న లూయిబ్రెయిలీ జయంతిని స్థానిక టీన్ జీవో భవన్ లో నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్ర చార ప్రముఖ్ పి.బాలకృష్ణ, మండల అధ్యక్షుడు కత్రోజి అశోక్, కార్యదర్శి పంచగుడి మహేశ్, కోశాధికారి రాం దాస్, సభ్యులు మోహన్ దాస్, సట్ల లక్ష్మణ్, భూమేశ్, వివిధ మండలాల నూతన అధ్యక్షులు పాల్గొన్నారు.
మండల కార్యవర్గం
కార్యక్రమంలో సంక్షమ్ మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.మండల అధ్యక్షులుగా సట్ల లక్ష్మణ్(భైంసా), పి.శ్యామ్(తానూర్), ఎం.సుధాకర్(లోకే శ్వరం), ఎస్.మారుతి(దిలావర్పూర్), ఎస్.సాయన్న(సారంగపూర్), డి.సాయన్న(నర్సాపూర్), డాక్టర్ వినోద్(సోన్), సాయినా«థ్(ముధోల్), ఐ.రవి(లక్ష్మణచాంద), సురేశ్(మామడ), ప్రసాద్‌గౌడ్(కడెం), డాక్టర్ రాము(దస్తురాబాద్)లను ఎన్నుకున్నారు.