నేడు జిల్లా బంద్
హన్మకొండ జిల్లా వద్ధని, జనగామ కావాలని డిమాండ్
ఏకమైన అన్ని రాజకీయ పార్టీలు
విజయవంతం చేయాలని పరిరక్షణ కమిటీ వినతి
వరంగల్ : నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా హన్మకొండ జిల్లా ఏర్పాటు నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వరంగల్ నుంచి హన్మకొండను వేరు చేయడాన్ని అడ్డుకునేందుకు జిల్లా పరిరక్షణ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ అధ్వర్యంలో మంగళవారం జిల్లా బంద్ చేపట్టాలని తీర్మానించారు. జనగామ ప్రాంత ప్రజలు కోరుకున్న విధంగా జిల్లా ఏర్పాటు చేపట్టని ప్రభుత్వం.. అనూహ్యంగా హన్మకొండ జిల్లా పేరును తెరపైకి తెచ్చింది.
చారిత్రక వారసత్వానికి నిలువుటుద్దమైన వరంగల్‌ను విడిదీయాలనే నినర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. టీఆర్ఎస్లోని కొందరి ప్రయోజనాల కోసమే హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. హన్మకొండ జిల్లా ఏర్పాటు అంశం అ«ధికార టీఆర్ఎస్లో చిచ్చుపెడుతోంది. ఆ పార్టీకి చెందిన మెజార్టీ నేతలు వరంగల్‌ను విడదీయవద్దని అభిప్రాయపడుతుండగా, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, ఎమ్మెల్యే సురేఖ హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయాల్సిందేనని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం పూర్తిగా నిర్ణయం తీసుకోనందున బంద్ చేయాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
జిల్లా పరిరక్షణ కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్‌కు బిజెపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఐ, ఎంఎస్ఎస్, ఆర్పీఐ, బీఎస్పీ, న్యూyð మోక్రసీ, ఎమ్మార్పీఎస్, కుల, ప్రజాసంఘాలు, కొన్ని ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వాణిజ్య, వ్యాపార, ఉద్యోగ రంగాలకు చెందిన వారంతా బంద్‌ను విజయవంతం చేయాలని జిల్లా పరిరక్షణ కమిటీ కోరింది.