విచారణ
- డీఎంహెచ్ఓలో అవకతవకలు..
- అధికారులకు నోటీసులు జారీ
- విచారణాధికారిగా ఏజేసీ
ఖమ్మం వైరారోడ్ :డీఎంహెచ్ఓ కార్యాలయంలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరిపేందుకు జిల్లా ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 16, 20వ తేదీల్లో విచారణ కు హాజరుకావాల్సిందిగా ఆ శాఖ అధికారులకు ఏజేసీ బాబూరావు నోటీసులు జారీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అవినీతికి అడా ్డగా మారటంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. రాష్ట్ర వ్యా ప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి చో టు చేసుకోవటంతో మంత్రి రాజయ్యతో పాటు ఉన్నతాధికారులను కూడా ప్రభుత్వం తొలగించిన విషయం విధితమే. అయితే ఆ అవినీతి ఊడలు జిల్లాకూ పాకాయి. కొన్ని అక్రమా లు వెలుగులోకి రావటంతో కలెక్టర్ ఇలంబరితి విచారణకు ఆదేశించారు. ఈ యేడాది మార్చిలో ఏజేసీకి విచారణ బాధ్యతలను అప్పగించారు.
ఈ క్రమంలో ఈనెల 11న విచాణకు హాజరుకావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఏజేసీ నోటీసులు పంపించారు. 16న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భానుప్రకాశ్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వెంకటేశ్వర్లును విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. భానుప్రకాశ్‌పై వైద్య ఆరోగ్య శాఖలో అక్రమ డిప్యూటేషన్ల వ్యవహారంలో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ యేడాది పల్స్ పోలి యో నిర్వహణ కోసం రూ. 47 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను కూడా దుర్వినియోగం చేశారనే ఆరోపణ రావటంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో డీఎంహెచ్ఓ, డీఐఓలకు సంబంధాలు ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. 20న సర్వీస్ ఇంజనీర్ తిరపయ్య, డీఎంహెచ్ కార్యాలయంలో గతంలో సూపరిం డెంట్‌గా పనిచే సిన ఇస్మాయిల్‌ను విచారించనున్నారు. సర్వీస్ ఇంజనీర్ తిరపయ్యపై గతంలో 104లో అక్రమ డిప్యూటేషన్ వ్యవహారంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంలో సంబంధిత ఉద్యోగుల నుండి లక్షల్లో డబ్బులు గుంజినట్లు వాదనలు వినిపించాయి. దీనిపై సర్వీస్ ఇంజనీర్‌ను విచారించనున్నారు. గత యేడా ది ఇక్కడ పనిచేసిన సూపరిండెంట్ ఇస్మాయిల్‌పై కూడా ఆరోపణలు ఉన్నా యి. ముడుపులు ముట్టజెప్పి ఖమ్మం నుండి వరంగల్ రీజ నల్ డెరైక్టర్‌కు సరెండర్ చేయించుకున్నాడనే ఆరోపణ ఇతని పై ఉంది. వీటన్నింటిపై జిల్లా అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ బాబూరావు 16,20 వతేదీల్లో తన చాంబర్లో విచారణ జరపనున్నారు. విచారణ పారదర్శకంగా జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవలని ఆ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు.