నాలుగు జిల్లాలకు డీటీసీపీఓలు
వరంగల్ అర్బన్ : కొత్త జిల్లాల ఆవిర్భావంతో జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు గురువారం విధుల్లో చేరారు. రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ ఆనంద్ బాబు ఆదేశాల మేరకు ఆయా జిల్లాల అధికారులు బాధ్యతలు స్వీకరించారు. గతంలో వరంగల్ జిల్లాకు టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి మాత్రమే ఉండేవారు. జిల్లా పునర్విభజనతో ఐదు జిల్లా ఏర్పాటైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా మినహా ఇతర జిల్లాలకు డీటీసీపీఓలను నియమించారు. వరంగల్ రూరల్ డీటీసీపీఓగా భిక్షపతి, భూపాలపల్లి ఇన్చార్జి డీటీసీపీఓగా ఖాలీల్, మహబూబాబాద్ ఇన్చార్జి డీటీసీపీఓగా ధరంసింగ్, జనగామ డీటీసీపీఓగా స్వామి నాయక్ బాధ్యతలు స్వీకరించారు. కాగా, వరంగల్ టీడీసీపీఓ, గ్రేటర్ వరంగల్ ఇన్చార్జి సిటీ ప్లానర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏ.కోదండ రామిరెడ్డిని సూర్యపేట జిల్లాకు బదిలీ చేశారు.
సాంకేతిక ప్రజారోగ్య శాఖ ఇంజినీర్లు..
సాంకేతిక ప్రజారోగ్య శాఖలకు రెండు జిల్లాలకు ఇంజినీరింగ్ అధికారులను నియామించారు. వరంగల్ అర్బన్ జిల్లాకు ప్రస్తుతం ఈఈగా పనిచేస్తున్న ఇన్చార్జి ఎస్ఈ రాజేశ్వర్ రావుకు ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు. వరంగల్ రూరల్ జిల్లా డీఈ శ్రీనాథ్ బాధ్యతలు చేపట్టారు.