పారిశ్రామిక రంగంతోనే దేశాభివృద్ధి
పెద్దాపురం :
పారిశ్రామిక రంగంతోనే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేష¯ŒS అసిస్టెంట్ మే నేజర్ డాక్టర్ బి.కిరీటి అన్నారు. దివిలి కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో రెండు రోజులు నిర్వహించే ఎంటర్ ప్రెన్యూర్షిప్ ఓరియంటేష¯ŒS శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ శర్మ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. కళాశాల చైర్మ¯ŒS బేతినీడి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ శర్మ, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పారిశ్రామిక రం గంలో ఉపాధి అవకాశాలున్నాయన్నారు. పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించారు. ఏవో సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసీవో పెద్దకాపు, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీనివాస్, ప్రొఫెసర్లు దయాకర్బాబు, రామకృష్ణ,పుల్లారావు పాల్గొన్నారు.