DivyaSree
-
హత్యాయత్నం కేసులో యువతికి ఐదేళ్ల జైలు
బంజారాహిల్స్ : తాను ప్రేమిస్తున్న యువకుడిని పెళ్లి చేసుకుంటుందన్న అక్కసుతో ఓ యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితురాలికి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి అయిదేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన పల్లకొండ మమత(27), వర్ధన్నపేట మండలం ఐలోను గ్రామానికి చెందిన పల్లకొండ దివ్యశ్రీ(23) సమీప బంధువులు. వరంగల్‌లో బీఫార్మసీ చ దువుతుండగా దివ్యశ్రీకి 2013 మార్చి 9న వరంగల్‌కు చెందిన మేనబావ రామాపురం కుమార్‌తో నిశ్చితార్ధం జరిగింది. అదే ఏడాది జూన్ 13న పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే అప్పటికే కుమార్‌ను ప్రేమిస్తున్న మమత అతడికి దివ్యశ్రీతో పెళ్లి జరుగుతుండటాన్ని జీర్ణించుకోలేకపోయింది. దివ్యను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. ఇందులో భాగంగానే కుమార్ ప్రవర్తన మంచిదికాదని, ఓ అమ్మాయిని ప్రేమించిన అతడు పెళ్లి చేసుకోబోతున్నాడని, తాళిబొట్టు కొనమని తననే పురమాయించాడని చెప్పింది. తనతో హైదరాబాద్‌కు వస్తే నీకే ఈ విషయం తెలుస్తుందని చెప్పి 2013 మే 4న బలవంతంగా రెలైక్కించింది. సాయంత్రం రైలు దిగి నేరుగా శ్రీకృష్ణానగర్‌లో నివసించే తన సోదరి స్వరూప ఇంటికి తీసుకొచ్చింది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామంటూ బెడ్రూంలోకి తీసుకెళ్లి కూరగాయలు కోసే కత్తితో విచక్షణారహితంగా పొడిచింది. తాను ప్రేమిస్తున్న కుమార్‌ను నువ్వు పెళ్లి చేసుకుంటావా...? నిన్ను చంపేస్తాను....కుమార్‌ను నీకు దక్కనివ్వనంటూ గాట్లు పెట్టింది. దివ్య రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా మమత బయట నుంచి తాళం వేసింది. విషయాన్ని దివ్యశ్రీ తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా కాబోయే భర్త కుమార్‌కు, తండ్రి సారయ్యకు తెలపగా ఇక్కడే ఉంటున్న తమ బంధువులను ఘటనా స్థలానికి పంపించగా వారు దివ్యశ్రీని ఆస్పత్రికి తరలించారు. మెడ, ఎద, పెదవులతోపాటు తొమ్మిది చోట్ల కత్తిగాట్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దివ్యను అంధవికారంగా చేయడం, కుదరకపోతే హత్య చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న మమతపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 307కింద కేసు నమోదు చేసి అరెస్ ్టచేసి రిమాండ్‌కు తరలించారు. పక్కా ఆధారాలు సమర్పించడంతో నిందితురాలు మమతకు సెషన్స్ జడ్జి రజని జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
వీడని చిక్కుముడి
సవాల్‌గా మారిన విద్యార్థిని మృతి కేసు అనుమానిత వ్యక్తులను విచారిస్తున్న పోలీసులు గొలుగొండ: విద్యార్థిని దివ్యశ్రీ మృతి మిస్టరీ వీడడం లేదు. ఈ సంఘటన పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఈ నెల 4వ తేదీ రాత్రి గొలుగొండ మం డలం అప్పన్నపాలెంలో అనుమానాస్పదస్థితిలో విద్యార్థిని మృతి చెందిన సంగతి తెలిసిందే. 16 రోజులయినా ఎటువంటి వివరాలు, ఆధారాలు దొరకలేదు. దివ్యశ్రీది హత్యా, ఆత్మహత్యా అన్నది శేషప్రశ్నగానే మిగిలిపోయింది. అప్పట్లో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమేదు చేశారు. నర్సీపట్నం ఏఎస్పీ సత్యఏసుబాబు, రూరల్ సీఐ గపూర్, గొలుగొండ ఎస్ఐ జోగారావు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఊరుకి దూరంగా తోటలలో నివాసం ఉండటం వల్ల అక్కడ ఏమి జరిగిందన్నది ఎవరికీ తెలియడం లేదు. దివ్యశ్రీ చదివే కళాశాలలో కూడా విచారణ జరిపారు. మృతిచెందక ముందు విద్యార్థిని రాంబిల్లిలోని బంధువ ఇంటికి వెళ్లింది. అక్కడా పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినికి ఇంటిలో ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం, ఎవరితోనూ శత్రుత్వం ఉండకపోవడం,ఆత్యహత్య చేసుకోడానికి బలమైన కారణాలు దొరకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కుమార్తె మృతిపై తల్లిదండ్రులకు కొన్ని కారణాలు తెలిసే ఉంటాయని, అయితే వారు నోరు విప్పకపోవడం వల్లే దర్యాప్తు ఆలస్యం అవుతోందన్న వాదన ఉంది. నెల రోజులు క్రితం కొత్తయల్లవరానికి చెందిన యువకుడోకరు ఈ ప్రాంతంలో కార్పెంటర్ పనులు చేసేవాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతనితోపాటు మరోయువకుడ్ని కూడా విచారణ చేస్తున్నారు. అలాగే వివిధ కోణాలలో దర్యాప్తు మమ్మరం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి కీలక సమాచారం దొరకలేదు. -
దివ్యశ్రీ, కీర్తన..శభాష్
తల్లి, తండ్రి మృతి చెందిన దుఃఖంలో పరీక్ష రాసి మంచి మార్కులు సాధించిన విద్యార్థినులు కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతి మంచి మార్కులతో పాసయ్యామని చెప్పుకోడానికి ఒకరికేమో తల్లిలేదు.. మరొకరికేమో తండ్రి లేడు. పరీక్షల సమయంలో ఈ ఇద్దరు విద్యార్థినిలు ఒకరు త ండ్రిని, మరొకరు తల్లిని కోల్పోయారు. పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసి నేడు మంచి ఫలితాలు సాధించారు. దివ్యశ్రీ జిపిఎ 10కి 10, కీర్తన 8.2 జీపీఏ సాధించి శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కడప నగరం పోలీస్లైన్లోని పద్మావతి, సుబ్బనరసింహల పెద్ద కుమార్తె దివ్యశ్రీ. నగరంలోని సాయి క్రిష ్ణహైస్కూల్లో పదవ తరగతి చదివింది. ఈమె తల్లి పద్మావతి మార్చి 25న తమ బందువుల ఆమ్మాయికి ఆరోగ్యం బాగా లేకుంటే చెన్నైలోని అపోలో అసుపత్రిలో చూపించుకుని 26వ తేదీ రాత్రి చెన్నై నుంచి వస్తుండగా రాజంపేట సమీపంలో లారీని కారు ఢీకున్న సంఘనటలో మృతి చెందింది. తన తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలిసిన దివ్యశ్రీ పుట్టెడు దుఖాన్ని దిగమింగుకుని 27న నాగార్జున మోడల్ స్కూల్లోని పరీక్షా కేంద్రానికి హాజరై తెలుగు పరీక్ష రాసింది. అన్ని సబ్జెక్టులలో పదికి పది (జీపీఏ)మార్కులను సాధించి సత్తా చాటుకుంది. తండ్రి ఇకరారని తెలిసి.. కడపలోని నెహ్రునగర్‌కు చెందిన వెంకటరమణ, లక్ష్మీదేవి పెద్ద కుమార్తె కీర్తన. జయనగర్‌కాలనీకి చెందిన జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివింది. వెంకట రమణ అనారోగ్యంతో భాదపడుతూ మార్చి 27 తెల్లవారుజామున మృతి చెందాడు. బాగా చదువుకోవాలమ్మా అని తండ్రి తరచూ చెప్పే మాటలను గుర్తు తెచ్చుకుని గుండె నిబ్బరం చేసుకుని నాగార్జున మోడల్ స్కూల్లో పరీక్షా కేంద్రానికి హాజరై పరీక్ష రాసింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో 8.2 జీపీఏ సాధించింది. అప్పట్లో పరీక్ష రాస్తున్న కీర్తనను డీఈఓ ప్రతాపరెడ్డి ఓదార్చారు. పై చదువుకు తన వంతు సాయం చేస్తానని కూడా చెప్పారు. అదే సెంటర్లో దివ్యశ్రీ అనే విద్యార్థిని తల్లి కూడా వృుతి చెందిందని తెలియక పోవటంతో అప్పట్లో డీఈఓ పరామర్శించలేకపోయారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థినులిద్దరూ మంచి మార్కులు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
నవ వధువు గొంతు కోసి..
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది ఆ యువతి.పెళ్లయి ప న్నెం డు రోజులైంది.. నూతన వధూవరులు అద్దె ఇంట్లో పా లు పొంగించారు. వారి జీవితం ఆనందంగా సాగాలని ఇరువురి బంధువులు ఆశీర్వదించారు. కానీ ఆ రాత్రే కాళరాత్రిగా మారింది. ప్రేమగా చెంతన చేర్చుకోవాల్సిన భర్తే కిరాతకుడిలా మారాడు. గొంతుకోసి చం పేందుకు ప్రయత్నించాడు. అరసవల్లిలోని శిమ్మవీధి లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన సంఘటన గురించి బంధువులు,పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం ఫైర్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నడిమింటి సత్యనారాయణకు, విజయనగరం జిల్లా జీఎంవలస మండలం చిన్నకుదమ గ్రామానికి చెందిన దివ్యశ్రీకి ఈనెల 8న వివాహమైంది. శుక్రవారం రాత్రి అరసవల్లిలోని శిమ్మవీధిలో అద్దె ఇంట్లో పాలు పొంగిం చారు. సత్యనారాయణ తల్లిదండ్రులు పట్టణంలోని బంధువుల ఇంటికి వెళ్లగా, దివ్యశ్రీ అమ్మ జయమ్మ, అమ్మమ్మ నారాయణమ్మ ఇంట్లో ఉన్నారు. అర్ధరాత్రి 12. 30 గంటల సమయంలో బ్లేడుతో దివ్యశ్రీపై సత్యనారాయణ దాడి చేశాడు.గొంతుపై తీవ్రగాయమై రక్తం కారుతుండడంతో అతనిని ప్రతిఘటించిన ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. సమీపంలోని బావి వద్ద దాక్కుంది. బయటకు వచ్చిన అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన దివ్యశ్రీ అ మ్మ, అమ్మమ్మను తోసేశాడు. నారాయణమ్మ ఎడమ చెయ్యి విరగ్గొట్టి కుడిచేతిని బ్లేడుతో కోసేశాడు. జయమ్మను గోడకేసి కొట్టాడు. బావిపక్కన దాక్కున్న దివ్యశ్రీని గమనించి అందులో పడేసి రాళ్లు వేశాడు. పాతకాలం బావి కావడంతో ఆమె బావిలోని మెట్లను పట్టుకుని వేలాడు తూ ఉంది. అప్పటికే ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగువారు అక్కడికి వచ్చారు. 100 నంబరు కు సమాచారం ఇచ్చారు. ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బావిలో ఉన్న ఆమెను రక్షించా రు. గాయాల పాలైన దివ్యశ్రీ, నారాయణమ్మను 108 లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దివ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పథకం ప్రకారమే... సంచలనం కలిగించిన ఈ సంఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. భార్యను ఒక పథకం ప్రకార మే హత్య చేసేందుకు ప్రయత్నించాడని భావిస్తున్నా రు. ముందుగా తల్లిదండ్రులను బంధువుల ఇంటికి పంపడం, సమయం చూసి హత్య చేసేందుకే బ్లేడ్ దగ్గర ఉంచుకున్నాడని భావిస్తున్నారు. ఉలిక్కి పడిన చినకుదమ...! జియ్యమ్మవలస : దివ్యపై హత్యాచారయత్నం జరగడంతో చినకుదమ గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. పెళ్లై 12 రోజులు కూడా కాకముందే భర్తే ఆమెను కడతేర్చేందుకు యత్నించాడని తెలుసుకున్న గ్రా మస్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గ్రామానికి చెందిన పల్ల జగన్నాథంనాయుడు, జయమ్మలకు దివ్య ఏకైక కుమార్తె. డిగ్రీ చదివిన ఆమెకు శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని అగ్నిమాపక కేం ద్రంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సత్యనారాయణతో ఈనెల 8న వివాహం చేశారు. వివాహ సమయంలో రూ. 6 లక్షల, బైక్, మూడు తులాల బం గారం కట్నంగా ఇచ్చారు. అయితే వివాహం జరి గిన 12 రోజులకే ఆమె హత్యాయత్నానికి గుర వ్వడంతో గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.