నవ వధువు గొంతు కోసి..
నవ వధువు గొంతు కోసి..
Published Sun, Dec 22 2013 3:55 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది ఆ యువతి.పెళ్లయి ప న్నెం డు రోజులైంది.. నూతన వధూవరులు అద్దె ఇంట్లో పా లు పొంగించారు. వారి జీవితం ఆనందంగా సాగాలని ఇరువురి బంధువులు ఆశీర్వదించారు. కానీ ఆ రాత్రే కాళరాత్రిగా మారింది. ప్రేమగా చెంతన చేర్చుకోవాల్సిన భర్తే కిరాతకుడిలా మారాడు. గొంతుకోసి చం పేందుకు ప్రయత్నించాడు. అరసవల్లిలోని శిమ్మవీధి లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన సంఘటన గురించి బంధువులు,పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం ఫైర్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నడిమింటి సత్యనారాయణకు, విజయనగరం జిల్లా జీఎంవలస మండలం చిన్నకుదమ గ్రామానికి చెందిన దివ్యశ్రీకి ఈనెల 8న వివాహమైంది. శుక్రవారం రాత్రి అరసవల్లిలోని శిమ్మవీధిలో అద్దె ఇంట్లో పాలు పొంగిం చారు.
సత్యనారాయణ తల్లిదండ్రులు పట్టణంలోని బంధువుల ఇంటికి వెళ్లగా, దివ్యశ్రీ అమ్మ జయమ్మ, అమ్మమ్మ నారాయణమ్మ ఇంట్లో ఉన్నారు. అర్ధరాత్రి 12. 30 గంటల సమయంలో బ్లేడుతో దివ్యశ్రీపై సత్యనారాయణ దాడి చేశాడు.గొంతుపై తీవ్రగాయమై రక్తం కారుతుండడంతో అతనిని ప్రతిఘటించిన ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. సమీపంలోని బావి వద్ద దాక్కుంది. బయటకు వచ్చిన అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన దివ్యశ్రీ అ మ్మ, అమ్మమ్మను తోసేశాడు. నారాయణమ్మ ఎడమ చెయ్యి విరగ్గొట్టి కుడిచేతిని బ్లేడుతో కోసేశాడు. జయమ్మను గోడకేసి కొట్టాడు.
బావిపక్కన దాక్కున్న దివ్యశ్రీని గమనించి అందులో పడేసి రాళ్లు వేశాడు. పాతకాలం బావి కావడంతో ఆమె బావిలోని మెట్లను పట్టుకుని వేలాడు తూ ఉంది. అప్పటికే ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగువారు అక్కడికి వచ్చారు. 100 నంబరు కు సమాచారం ఇచ్చారు. ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బావిలో ఉన్న ఆమెను రక్షించా రు. గాయాల పాలైన దివ్యశ్రీ, నారాయణమ్మను 108 లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దివ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
పథకం ప్రకారమే...
సంచలనం కలిగించిన ఈ సంఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. భార్యను ఒక పథకం ప్రకార మే హత్య చేసేందుకు ప్రయత్నించాడని భావిస్తున్నా రు. ముందుగా తల్లిదండ్రులను బంధువుల ఇంటికి పంపడం, సమయం చూసి హత్య చేసేందుకే బ్లేడ్ దగ్గర ఉంచుకున్నాడని భావిస్తున్నారు.
ఉలిక్కి పడిన చినకుదమ...!
జియ్యమ్మవలస : దివ్యపై హత్యాచారయత్నం జరగడంతో చినకుదమ గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. పెళ్లై 12 రోజులు కూడా కాకముందే భర్తే ఆమెను కడతేర్చేందుకు యత్నించాడని తెలుసుకున్న గ్రా మస్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గ్రామానికి చెందిన పల్ల జగన్నాథంనాయుడు, జయమ్మలకు దివ్య ఏకైక కుమార్తె. డిగ్రీ చదివిన ఆమెకు శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని అగ్నిమాపక కేం ద్రంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సత్యనారాయణతో ఈనెల 8న వివాహం చేశారు. వివాహ సమయంలో రూ. 6 లక్షల, బైక్, మూడు తులాల బం గారం కట్నంగా ఇచ్చారు. అయితే వివాహం జరి గిన 12 రోజులకే ఆమె హత్యాయత్నానికి గుర వ్వడంతో గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.
Advertisement
Advertisement