6న కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్ష | AP Police Constable Admit Card 2016 Exam on 06.11.2016 | Sakshi
Sakshi News home page

6న కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్ష

Published Wed, Nov 2 2016 2:42 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

6న కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్ష - Sakshi

6న కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్ష

 విజయనగరం లీగల్ : జిల్లావ్యాప్తంగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 6న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు  జిల్లా ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో రీజనల్ కో ఆర్డినేటర్స్‌తో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 60 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామన్నారు.

 అభ్యర్థులు హాల్‌టిక్కెట్, గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకు రావాలని సూచించారు. ప్రతీ అభ్యర్థి ఒక గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సెల్‌ఫోన్‌లు, క్యాలిక్యూలేటర్లు, గడియారాలు వంటివి నిషేధించినట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో పోలీస్ సేవా దళ్‌ను నియమించామన్నారు. అభ్యర్థులను వారి వారి కేంద్రాలకు పోలీస్ వాహానాలపై తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఏ.వి.రమణ, ఏఆర్ డీఎస్పీ హనుమంతు, జేఎన్‌టీయూ రీజనల్ కో ఆర్డినేటర్స్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement