అనాథ ఆకలి తీర్చిన పోలీస్‌ | Police Constable Food Supply to Orphan on Road in Vizianagaram | Sakshi
Sakshi News home page

అనాథ ఆకలి తీర్చిన పోలీస్‌

Published Thu, May 14 2020 1:15 PM | Last Updated on Thu, May 14 2020 1:15 PM

Police Constable Food Supply to Orphan on Road in Vizianagaram - Sakshi

అనాథకు ఆహారం తినిపిస్తున్న కానిస్టేబుల్‌ సురేష్‌కుమార్‌

విజయనగరం ,కొత్తవలస: విధులు అందరూ నిర్వర్తిస్తుంటారు. కాని సేవలు మాత్రం కొందరే అందిస్తారు. పోలీసులంటే సమాజంలో ఓ రకమైన భావం ఉన్న ఈ రోజుల్లో వారిలోనూ కారుణ్యం ఉంటుందని వారి గుండెల్లోనూ మానవత్వం ఉంటుందని కొత్తవలస పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ వై.సురేష్‌ కుమార్‌ నిరూపిస్తూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. విశాఖ–అరకు జాతీయరహదారిలో ఓ ప్రైవేటు ఆస్పత్రి సమీపంలో ఓ అనాథ వారం రోజులుగా చెత్తలోనే కాపురముంటూ ఆకలి వేస్తే అన్నం కావాలని కూడా ఎవరినీ అడగకుండానే జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయం గమనించిన సురేష్‌ వెంటనే స్పందించి ఆహారం సమకూర్చటంతో పాటు తనచేతితో ముద్దలు తినిపించి మరీ ఆ జీవి ఆకలితీర్చి మానవత్వాన్ని చాటుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement