diwanchervu
-
దివాన్ చెరువు పంచాయతీ కార్యదర్శి అరెస్ట్
రాజమహేంద్రవరం రూరల్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో దివాన్ చెరువు పంచాయతీ కార్యదర్శి కట్టా చంద్రశేఖర్‌ను అర్బ¯ŒS జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ కె.గంగరాజు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... దివా¯ŒSచెరువు గ్రామానికి చెందిన బూరా అబ్బులు అదే గ్రామ పంచాయతీ కార్యాలయంలో శానిటేష¯ŒS వర్కర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు ఇప్పించాలని కార్యదర్శి చంద్రశేఖర్‌ను బూరా అబ్బులు, పంచాయతీ కార్మికులు కోరారు. జీతం బిల్లులు చేయడానికి కొంత ఖర్చవుతుందని కార్యదర్శి చెప్పాడు. దీంతో కార్మికులు సుమారు రూ.26 వేలు ఇచ్చారు. అయినా జీతాలు ఇవ్వకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి కార్మికులపై కక్షగట్టి ఒక చోట పనిచేసే వారిని మరో చోటకు మారుస్తూ వేధింపులకు గురిచేయడంతో పాటు కులంపేరుతో దూషించాడని బూరా అబ్బులు గత ఏడాది ఆగస్టు 23న బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కనకారావు కేసు నమోదు చేయగా, అర్బ¯ŒS జిల్లా ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ కె.గంగరాజు విచారణ నిర్వహించారు. విచారణలో కులంపేరుతో దూషించడంతో పాటు, వేధింపులకు గురిచేసినట్టు ఫిర్యాదు దారుడితోపాటు సాక్షులు చెప్పారు. దీంతో డీఎస్పీ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. -
సాహిత్యంలో ‘వ్యాసం’ విశిష్టం
సాహితీవేత్త డాక్టర్ పతంజలి దివా¯ŒSచెరువు (రాజానగరం) : సాహిత్యంలో ‘వ్యాసం’ అత్యంత సమర్థంగా నిర్వహించాల్సిన ప్రక్రియని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పతంజలిశాస్త్రి అన్నారు. వ్యాసరచనను ముఖ్య వ్యాసంగంగా స్వీకరించి కొనసాగిస్తున్న అతి కొద్దిమందిలో డాక్టర్ రెంటాల ఒకరని ప్రశంసించారు. కొత్తపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ రెంటాల శ్రీవెంకటేశ్వర్రావు రచించిన ‘ఒలుపు’ సాహితీ వ్యాస సంకలనాన్ని ఆవిష్కరించారు. దివా¯ŒSచెరువులో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ పంతంజలిశాస్త్రి అధ్యక్షత వహించగా వెలమాటి సత్యనారాయణ గ్రంథావిష్కరణ చేశారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ రచయిత్రి డాక్టర్ వాడ్రేవు వీరలక్షీ్మదేవి మాట్లాడుతూ పుస్తకానికి ‘ఒలుపు’ అని పేరు పెట్టడంలో ఉన్న ఔచిత్యాన్ని తెలియజేశారు. కవులు బీవీ ప్రసాద్, కాండూరి శ్రీరామచంద్రమూర్తి, మధునాపంతులు సత్యనారాయణమూర్తి, పుష్పరాజ్, ఎ.పేరయ్యనాయుడు, భగ్వాస్ కనకయ్య, డాక్టర్ జ్యోస్యుల కృష్ణబాబు, అవధానుల మణిబాబు డాక్టర్ ధూళిపాళ అన్నపూర్ణ పాల్నొన్నారు.