దివాన్ చెరువు పంచాయతీ కార్యదర్శి అరెస్ట్
Published Tue, Jan 17 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
రాజమహేంద్రవరం రూరల్ :
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో దివాన్ చెరువు పంచాయతీ కార్యదర్శి కట్టా చంద్రశేఖర్‌ను అర్బ¯ŒS జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ కె.గంగరాజు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... దివా¯ŒSచెరువు గ్రామానికి చెందిన బూరా అబ్బులు అదే గ్రామ పంచాయతీ కార్యాలయంలో శానిటేష¯ŒS వర్కర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు ఇప్పించాలని కార్యదర్శి చంద్రశేఖర్‌ను బూరా అబ్బులు, పంచాయతీ కార్మికులు కోరారు. జీతం బిల్లులు చేయడానికి కొంత ఖర్చవుతుందని కార్యదర్శి చెప్పాడు. దీంతో కార్మికులు సుమారు రూ.26 వేలు ఇచ్చారు. అయినా జీతాలు ఇవ్వకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి కార్మికులపై కక్షగట్టి ఒక చోట పనిచేసే వారిని మరో చోటకు మారుస్తూ వేధింపులకు గురిచేయడంతో పాటు కులంపేరుతో దూషించాడని బూరా అబ్బులు గత ఏడాది ఆగస్టు 23న బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కనకారావు కేసు నమోదు చేయగా, అర్బ¯ŒS జిల్లా ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ కె.గంగరాజు విచారణ నిర్వహించారు. విచారణలో కులంపేరుతో దూషించడంతో పాటు, వేధింపులకు గురిచేసినట్టు ఫిర్యాదు దారుడితోపాటు సాక్షులు చెప్పారు. దీంతో డీఎస్పీ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.
Advertisement