పావురం ఎగరలేదని.. ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు | Panchayat Scene Comes To Life As Top Cop’s Pigeon Release Fails | Sakshi
Sakshi News home page

పావురం ఎగరలేదని.. ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు

Published Thu, Aug 22 2024 11:38 AM | Last Updated on Thu, Aug 22 2024 12:07 PM

Panchayat Scene Comes To Life As Top Cop’s Pigeon Release Fails

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని సామెత. అధికారంలో ఉన్నవాళ్లు ఎలాంటి ఆదేశాలైనా ఇస్తారనడానికి ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. రాష్ట్రంలోని ముంగేలీ జిల్లాలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథి, బీజేపీ ఎమ్మె ల్యే, మాజీ మంత్రి పున్నులాల్‌ మోహ్లేతో పా టు కలెక్టర్‌ రాహుల్‌ దేవ్, ఎస్పీ గిరిజా శంకర్‌ జైస్వాల్‌లకు పావురాలు అందజేశారు. 

ఎమ్మె ల్యే, కలెక్టర్‌ వదిలిన పావురాలు రివ్వుమంటూ ఎగిరిపోయాయి. ఎస్పీ విడిచిపెట్టింది మాత్రం నేలపై పడిపోయిందట! సదరు వీడియోను సచిన్‌ గుప్తా అనే సోషల్‌ మీడియా యూజర్‌ తన ‘ఎక్స్‌’ హ్యాండిల్లో షేర్‌ చేశారు. ‘‘ఛత్తీస్‌గడ్‌లో పంచాయత్‌–3 (వెబ్‌ సిరీస్‌) రిపీటైంది. పంద్రాగస్టు సందర్భంగా ఎస్పీ ఎగరేసిన పావు రం కింద పడిపోయింది. వీడియో చూడండి’’ అని రాసుకొచ్చారు.

 దాంతో తన పరువు పో యిందని భావించిన పోలీస్‌ బాసు, సంబంధి త అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఏకంగా లేఖ రాశారు! ‘‘పావురం అనారోగ్యంతో ఉండటమే దీనికి కారణం. అది ఎగరకుండా కింద పడిపోయిన వైనం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరలై జిల్లా యంత్రాంగం పరువు తీసింది. బాధ్యుడైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోండి’’ అంటూ రాసుకొచ్చారట. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement