DJ team
-
నాట్స్ సంబరాల్లో 'డీజే'
షాంబర్గ్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అంగరంగ వైభవంగా చికాగోలోని శ్యాంబర్గ్లో నిర్వహిస్తున్న అమెరికా తెలుగు సంబరాల్లో 'డీజే' టీం సందడి చేసింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. అమెరికాలో తెలుగువారంతా ఒక్క చోట చేరి ఇలా సంబరాలు చేసుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. డీజే చిత్రయూనిట్ సభ్యులు, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు, కామెడీ విలన్ సుబ్బరాజు, హీరోయిన్ పూజా హెగ్డేలు నాట్స్ సంబరాల్లో పాల్గొన్నారు. నాట్స్ చైర్మన్ సామ్ మద్దాళి, ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ, సంబరాల కన్వీనర్ రవి ఆచంటలు అతిధులను సాదరంగా సత్కరించారు. మోహన కృష్ణ మన్నవ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు సజావుగా జరగటానికి ఎంతో విలువైన కాలాన్ని వెచ్చించి నాట్స్ ను ముందుకు నడిపిస్తున్న బోర్డుకి ధ్యనవాదాలు తెలుపారు. నాట్స్ కార్య నిర్వహణ సభ్యులను, స్టేట్ కోఆర్డినేటర్లను, జోనల్ వీక్ ప్రెసిడెంట్లను ప్రత్యేకంగా అభినందించి అందరినీ వేదిక పై పిలిచి, సభకు పరిచయం చేశారు. నిర్విఘ్నంగా సంబరాలను నిర్వహిస్తున్న సంబరాల కమిటీ సేవలను ప్రత్యేకంగా అభినందించారు. అమెరికా గడ్డ పై వృత్తి, వ్యాపార రంగాల్లో పైకి ఎదిగిన యువ తెలుగు వ్యాపారవేత్తలను టీడీపీ నేత రేవంత్ రెడ్డి అభినందించారు. తెలుగు వారు అమెరికా రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిచ్చారు. అనంతరం, ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేత రేవంత్ మ్యూజిక్ హంగామా స్థానిక కళాకారులు, చిన్నారులు చేసిన మనలోని మనిషి నాటిక చూస్తున్న ఆహూతుల కళ్ళు చెమర్చాయి. చిన్న పిల్లలు చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందించారు. అలాగే గోదా కళ్యాణం ఆముక్తమాల్యద ఆహూతులను కట్టిపడేశాయి. ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుకు, సాహితీ వేత్త, కవి, జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి లకు నాట్స్ ఘనంగా నివాళులర్పించింది. ఆలీ, పృధ్వీ అండ్ టీమ్ చేసిన కామెడీ నవ్వుల పువ్వులు పూయించింది. వారి కామెడీకి విశేష స్పందన లభించింది. పగలనక రాత్రనక కష్టపడుతున్న వాలంటీర్ల సేవలన అందరూ అభినందించారు. సంబరాల్లో రెండో రోజు చివరగా వచ్చిన రేవంత్ టీమ్ హుషారైన పాటలతో అందరిని చిందులు వేయించారు. పాత కొత్త పాటలతో రేవంత్ టీమ్ చేసిన మ్యూజిక్ హంగామా తెలుగువారికి అంతులేని సంతోషాలు పంచింది. -
తెలుగు సంబరాలకు ముమ్మరంగా సన్నాహాలు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగే తెలుగు సంబరాలు చికాగో వేదికగా జరిపేందుకు నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఆ వేడుకల్లో ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథమహారథులు విచ్చేస్తున్నారు. ఈ సంబరాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. బన్నీతో పాటు డీజే టీం కూడా సంబరాల్లో సందడి చేయనుంది. అమెరికాలో తొలిసారిగా నాట్స్ మూడు రోజుల పాటు మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తెలుగు సినీ గాయనీ గాయకులు హుషారైన పాటలతో ఈ మ్యూజిక్ నైట్ సాగనుంది. జూన్ 30 నుంచి జులై 2 వరకు కన్నులపండువగా సంబరాలు జరగనున్నాయి. వసుదైక కుటుంబం పేరుతో నాట్స్ సంబరాల టీం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. తెలుగు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం జరగనుంది. భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే నాట్స్ దానికి తగ్గటుగానే ఈ సంబరాలు జరగనున్నాయి. అమెరికాలో తెలుగు వారంతా ఈ సంబరాలకు విచ్చేసి సంతోషాలను పంచుకోవాలని నాట్స్ పిలుపునిచ్చింది. సంబరాలకు సాహితీ ప్రముఖులు నాట్స్ నిర్వహించనున్న అమెరికా తెలుగు సంబరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి సాహితీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్లొననున్నారు. ప్రముఖ కవి నామిని సుబ్రమణ్య నాయుడు, ప్రముఖ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సినీనటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణిలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్, సిలికానాంధ్ర ఫౌండర్ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ వీదమాచినేని దుర్గాభవాని ఈ సాహితీ సంబరాల్లో పాలుపంచుకోనున్నారు. తెలుగు భాషా, సాహిత్యంపై ఈ సంబరాల్లో చర్చ జరగనుంది. బాస్కెట్ బాల్ పోటీలకు విశేష స్పందన ముందుగా స్థానిక తెలుగు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నాట్స్ బాస్కెట్ బాల్ పోటీలను నిర్వహించింది. నేపర్విల్లె లోని ఫోర్ట్ విల్ యాక్టివిటీ సెంటర్ లో హైస్కూల్ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు జరిగాయి. చాలామంది విద్యార్థులు ఈ పోటోల్లో పాల్గొన్నారు. విజేతలకు నాట్స్ బహుమతులు అందించింది. చికాగోలోని శ్యాంబర్గ్ వేదికగా ఈ సారి సంబరాలు జరగనున్నాయి. ఈ సంబరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు.