dk bharatasimhareddy
-
అక్రమ మైనింగ్ కేసులో రూ. 32 కోట్ల జరిమానా!
-
రు.32 కోట్ల జరిమానా చెల్లించండి: భరతసింహారెడ్డికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో అధికారులు విధించిన 32 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని కాంగ్రెస్ నేత భరతసింహారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తక్షణమే మైనింగ్ నిలిపివేయాలని ఆదేశించింది. ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలంలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
అవినీతిపరుడిని చూపిస్తే.. 10 లక్షల రివార్డు
మాజీమంత్రి డీకే అరుణపైన, ఆమె భర్తపైన మహబూబ్నగర్ జిల్లాపరిషత్ చైర్మన్ బండారు భాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. డీకే అరుణ భర్త డీకే భరతసింహారెడ్డిని మించిన అవినీతిపరుడు అసలు గద్వాలలోనే ఎవరూ లేరని ఆయన అన్నారు. ఎవరైనా అలా ఉన్నట్లు నిరూపిస్తే.. ఆ వ్యక్తికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని భాస్కర్ బహిరంగంగా సవాలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న డీకే అరుణ.. తన భర్త అక్రమ వ్యాపారాలకు రక్షణ కవచంగా ఉపయోగపడుతున్నారని ఆయన ఆరోపించారు.