టెక్నాలజీ యుగంలో కూడా ఎంత కష్టం..
రాంఘడ్: ప్రపంచం రోజు రోజుకు కొత్త టెక్నాలజీలతో ముందుకు దూసుకుపోతోంది. పురాతన కాలంలో విద్యుత్ అందుబాటులో లేనప్పుడు దీపాల కింద చదివారని విన్నాం. ప్రస్తుతం అలాంటి సంఘటననే ఛతీస్‌గడ్‌లో కళ్లారా చూస్తున్నాం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని అంటుంటారు. కానీ ఆ బాలలు టెక్నాలజీ యుగంలో కూడా కిరోసిన్ ద్వీపాల కింద కూర్చోని చదువుకుంటున్నారు.
రాంఘడ్ ప్రాంతంలో ముగ్గురు విద్యార్థులు ద్వీపాల కింద చదువుకుంటున్న దృశ్యం కెమెరామెన్ చేతికి చిక్కింది. అంతే ఏముందీ క్లిక్‌మని పించాడు. ఆ ప్రాంతానికి విద్యుత్ లైన్స్ లేవని, ఎక్కువగా బ్యాటరీలను, సొలార్ లైట్స్‌ను వాడుతారని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంపై సంబంధిత అధికారి డీఎం కొరియా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్స్ లేవని తెలిపారు. అక్కడ సొలార్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయన్నారు. వర్షకాలం అవ్వడంతో బ్యాటరీలు, సొలార్ ప్లేట్స్ సరిగా పనిచేయడం లేదని తెలిపారు. ఒక నెలలోపు రాంఘడ్ ప్రాంతంలోని సోలార్ ప్లేట్స్‌ను, బ్యాటరీలను రిపేర్ చేసి విద్యుత్ నిల్వ చేసి కరెంట్ అందిస్తామని ఆయన చెప్పారు.
Within a month repair of batteries and solar plates will be done and electricity will be restored in Ramgarh area: DM, Koriya
— ANI (@ANI) August 25, 2017
Ramgarh has no electricity lines,has solar power plants.There is trouble during rainy season,batteries&solar plates not working: DM Koriya pic.twitter.com/qrsJfQ9JII
— ANI (@ANI) August 25, 2017