డీఎంకే భవిష్య సారధి ఎవరో చెప్పేసిన కనిమొళి!
చెన్నై : డీఎంకేకు భవిష్యత్ సారథి ఎంకే స్టాలిన్ అని ఆ పార్టీ ఎంపీ కనిమొళి చెప్పేశారు. ఆయన నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్లెవరూ డీఎంకేలో లేరని స్పష్టం చేశారు. డీఎంకే కోశాధికారి స్టాలిన్, ఆ పార్టీ ఎంపీ కనిమొళి అన్నా చెల్లెళ్లు అయినప్పటికీ, వారి మధ్య పదవుల వివాదం సాగుతున్నట్లుగా తమిళనాట ప్రచారం సాగుతోంది.
దీనికి కళ్లెం వేస్తూ ఓ ఆంగ్ల మీడియాతో కనిమొళి మాట్లాడారు. డీఎంకేకు భావి నేత స్టాలిన్ అని, ఆయన సారథ్యంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతారని స్పష్టం చేశారు.