Doctor Harikrishna
-
సీఎం కార్యాలయంలో అధికారుల శాఖలు ఇవే
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులకు శాఖలు కేటాయించారు. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఇతర అధికారులు అందరికీ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం ఈ కేటాయింపులు చేశారు. అజేయ కల్లం, సీఎం ముఖ్య సలహాదారు: సాధారణ పరిపాలన, హోంశాఖ, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ, శాంతిభద్రతల అంశాలు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యకలాపాలు. పీవీ రమేష్, సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ: వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యాశాఖ(పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య), పరిశ్రమలు,వాణిజ్యం, మౌళిక వసతులు, పెట్టుబడులు,ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, ఇన్ఫ్రా, ఇంధన శాఖ. సొల్మన్ ఆరోక్య రాజ్, సీఎం కార్యదర్శి: ట్రాన్స్పోర్ట్ రహదారులు, భవనాల శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, గృహ నిర్మాణం, ఆహార,పౌరసరఫరాల, వినియోగదారుల సమస్యలు, పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి, సెర్ప్, అన్ని సంక్షేమ శాఖలు, యువజన వ్యవహారాలు, క్రీడలు. కె.ధనుంజయరెడ్డి, సీఎం అదనపు కార్యదర్శి: నీటి వనరులు, పర్యావరణం, అటవీ,సాంకేతిక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, సీఆర్డీఏ, వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, పర్యాటకం. జె.మురళి, సీఎం అదనపు కార్యదర్శి: పశుసంవర్థక, పాడి పరిశ్రమ,మత్స్యశాఖ, సహకారం, సంస్కృతి. డాక్టర్ ముక్తాపురం హరికృష్ణ, సీఎం ప్రత్యేక అధికారి: ఆరోగ్య శ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్), విజ్ఞాపనలు(ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజల విజ్ఞప్తులు). పి.కృష్ణమోహన్‌రెడ్డి, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ): ముఖ్యమంత్రికి సంబంధించిన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, అపాయింట్మెంట్స్, విజిటర్స్ అపాయింట్మెంట్స్. -
హరికృష్ణ, ఎస్వీ దీక్ష భగ్నం
సాక్షి నెట్వర్క్: వైఎస్ విజయమ్మ సమర దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ నేత డాక్టర్ హరికృష్ణ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ప్రారంభించిన ఆమరణ దీక్షను పోలీసులు శనివారం మధ్యాహ్నం భగ్నం చేశారు. ఆరురోజులుగా ఆమరణ దీక్ష చేయడం వల్ల హరికృష్ణ ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలపడంతో పోలీసులు దీక్షను భగ్నం చేసి.. అంబులెన్సలో బలవంతంగా కొత్తచెరువు ఆస్పత్రికి తరలిం చారు. ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తానని ఆయన మొండికేయడంతో వైఎస్సార్ సీపీ నేతలు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశారు. కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను తీవ్ర ఉద్రిక్తతల మధ్య శనివారం తెల్లవారు జామున పోలీసులు భగ్నం చేశారు. ఎస్వీ దీక్ష శనివారంతో ఆరోరోజుకి చేరిన నేపథ్యం లో ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు సూచించడంతో ఎస్పీ రఘురామ్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు పెద్ద సంఖ్య లో శిబిరం వద్దకు చేరుకుని బలవంతంగా అంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్సలు చేయించుకునేందుకు ఎస్వీ మోహన్‌రెడ్డి నిరాకరిస్తూ దీక్షను కొనసాగించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి ఆసుపత్రికి చేరుకుని కొబ్బరి నీళ్లిచ్చి దీక్షను విరమింపజేశారు. శ్రీకాకుళంలో పద్మజ దీక్ష భగ్నం: శ్రీకాకుళంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజ నాలుగురోజులుగా చేపట్టిన ఆమరణ దీక్షను శనివారం సాయంత్రం 6 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా పద్మజను అంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.