doctors postings
-
ఒక్కో పోస్టుకు 48 మంది పోటీ
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య విభాగంలో 31 సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఎస్) పోస్టుల నియామకానికి ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామక ప్రక్రియలో భాగంగా 1,483 మంది అభ్యర్థులతో ప్రాథమిక మెరిట్ జాబితా ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సుమారు 48 మంది చొప్పున పోటీ పడుతున్నారు. ప్రాథమిక మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ తుది గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. అభ్యర్థులు casrecruitmentdphfw2022@gmail.com మెయిల్ ఐడీకు అభ్యంతరాలు పంపాల్సి ఉంటుందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది కొరతకు తావుండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజారోగ్య విభాగం పరిధిలో 2019 నుంచి 929 వైద్యుల భర్తీ చేపట్టింది. ఇందులో 899 పోస్టుల భర్తీ పూర్తవగా, మిగిలిన 31 పోస్టులను ప్రస్తుతం భర్తీ చేస్తున్నారు. అదే విధంగా 4,520 పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతివ్వగా ఇప్పటికే 4,315 పోస్టుల భర్తీ పూర్తయింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. -
వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అనంతపురం మెడికల్: జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) డాక్టర్ రమేశ్‌నాథ్ తెలియజేశారు. గైనకాలజిస్ట్ పోస్టులు–16, అనస్తిటిస్ట్–15, పీడియాట్రీషియన్–9, స్టాఫ్‌నర్సులు–52 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/డిప్లొమా/డీఎన్బీ కోర్సుల్లో ఉత్తీర్ణులై, ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిష్టరై ఉండాలి. స్టాఫ్‌నర్సు పోస్టులకు గాను జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిష్టరై ఉండాలి. ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు ఫారాలు, ఇతర వివరాలను www.anantapuramu.ap.gov.in వెబ్సైట్లో అందుబాటు ఉంచారు. ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను ‘జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి కార్యాలయం, ప్రభుత్వ సర్వజనాస్పత్రి కాంపౌండ్, అనంతపురం’ చిరునామాకు రిజిష్టర్ పోస్టులో గానీ, స్వయంగా గానీ అందజేయచ్చు.