Dolly Ki Doli
-
'అవార్డుల కోసం సినిమాలు చేయను'
ముంబై: అవార్డుల కోసం సినిమాలు చేయనని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ స్పష్టం చేసింది. సినిమాను అంగీకరించే ముందు తన పాత్ర బాగుందా, లేదా అనేది మాత్రమే చూస్తానని చెప్పింది. అవార్డు వస్తుందా, లేదా అనేది పట్టించుకోనని వెల్లడించింది. విభిన్నమైన, విలక్షణ పాత్రలు చేయడానికే తాను ఆసక్తి చూపుతానని పేర్కొంది. తన తాజా చిత్రం 'డాలీ కీ డోలీ' విమర్శకుల ప్రశంసలు అందుకుంటుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేసింది. ప్రతిఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని తెలిపింది. అభిషేక్ దొగ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు, పులకిత్ సామ్రాట్ ముఖ్యపాత్రల్లో నటించారు. -
తాగేసి సెట్లో చిందులు...
సోనమ్ కపూర్... పూటుగా తాగేసి సెట్టంతా చిందులు తొక్కారట. అనిల్‌కపూర్ లాంటి సూపర్‌స్టార్ కూతురయ్యుండి... ఇంత చౌకబారుగా ప్రవర్తిస్తుందా? అని లొకేషన్లో అందరూ చెవులు కొరుక్కున్నారు. అయితే, ఇక్కడ ట్విస్టు వేరే ఉంది. ఏమిటంటే, ఈ ముద్దుగుమ్మ ‘డాలీ కి డాలీ’ అనే సినిమా చేస్తున్నారు. అభిషేక్ డోగ్రా దర్శకుడు. సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్ నిర్మాత. ఈ సినిమాలో కథ రీత్యా సోనమ్ తాగి తూలుతూ పాడే ఓ పాట ఉంది. ఆ పాట షూటింగ్ నిమిత్తం నిజమైన విస్కీ బాటిల్‌ని తెప్పించారు దర్శకుడు. పాట షూటింగ్ ప్రశాంతంగా జరిగిపోయింది. అయితే... షూటింగ్ పూర్తయ్యాక కూడా సోనమ్ ప్రవర్తనలో మార్పు లేదు. అది గమనించిన కొందరు... ‘ఇంకా పాత్ర నుంచి బయటకు రాలేదనుకుంట’ అనుకున్నారు. ఇంకేముంది! ఎవరికి తోచినట్లు వారు మాట్లాడటం మొదలుపెట్టారు. పరిస్థితి చూసి అర్బాజ్‌ఖాన్ కంగారు పడుతుండగా, అసలు విషయాన్ని అప్పుడు బయటపెట్టారు సోనమ్. కాసేపు అందర్నీ ఫూల్స్ చేయాలనిపించి అలా నటించినట్లు చెప్పింది. ఆమె చెప్పేది నిజమని సెట్లో చాలామంది నమ్మలేకపోయారు. అంత గొప్పగా నటించారట సోనమ్. ఎంతైనా గొప్ప నటుడి కూతురు కదా! -
కన్ఫ్యూజ్ కోమలి..
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ పూర్తి కన్ఫ్యూజన్లో ఉండటమే కాదు, తన మాటలతో మీడియా ప్రతినిధులనూ కన్ఫ్యూజన్లో పడేస్తోంది. ఎలాంటి వరుడు రావాలని కోరుకుంటున్నారని అడిగిన పాపానికి.. తనకు ఎలాంటి వాడు కావాలో తనకే తెలియదని బదులిచ్చింది. ‘డాలీకీ డోలీ’ షూటింగ్ విరామంలో కలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆమె సమాధానంతో జుట్టు పీక్కున్నారు. అయితే, ఇప్పట్లోనే పెళ్లి చేసుకుని, స్థిరపడాలనే కోరికేమీ తనకు లేదని ముక్తాయించింది.