'అవార్డుల కోసం సినిమాలు చేయను'
ముంబై: అవార్డుల కోసం సినిమాలు చేయనని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ స్పష్టం చేసింది. సినిమాను అంగీకరించే ముందు తన పాత్ర బాగుందా, లేదా అనేది మాత్రమే చూస్తానని చెప్పింది. అవార్డు వస్తుందా, లేదా అనేది పట్టించుకోనని వెల్లడించింది. విభిన్నమైన, విలక్షణ పాత్రలు చేయడానికే తాను ఆసక్తి చూపుతానని పేర్కొంది.
తన తాజా చిత్రం 'డాలీ కీ డోలీ' విమర్శకుల ప్రశంసలు అందుకుంటుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేసింది. ప్రతిఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని తెలిపింది. అభిషేక్ దొగ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజ్కుమార్ రావు, పులకిత్ సామ్రాట్ ముఖ్యపాత్రల్లో నటించారు.