
కన్‌ఫ్యూజ్ కోమలి..
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ పూర్తి కన్‌ఫ్యూజన్‌లో ఉండటమే కాదు, తన మాటలతో మీడియా ప్రతినిధులనూ కన్‌ఫ్యూజన్‌లో పడేస్తోంది. ఎలాంటి వరుడు రావాలని కోరుకుంటున్నారని అడిగిన పాపానికి.. తనకు ఎలాంటి వాడు కావాలో తనకే తెలియదని బదులిచ్చింది. ‘డాలీకీ డోలీ’ షూటింగ్ విరామంలో కలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆమె సమాధానంతో జుట్టు పీక్కున్నారు. అయితే, ఇప్పట్లోనే పెళ్లి చేసుకుని, స్థిరపడాలనే కోరికేమీ తనకు లేదని ముక్తాయించింది.