డిఫెన్స్‌లో ‘ప్రైవేట్’తో భాగస్వామ్యం
న్యూఢిల్లీ: రక్షణ రంగంలోని ఆరు కీలక విభాగాల్లో పరికరాల కొనుగోలుకు సంబంధించి అత్యంత తక్కువ కోట్ చేసిన బిడ్డరుకు కాంట్రాక్టు ఇవ్వడం కాకుండా దేశీ ప్రైవేట్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఆయా సంస్థల ఎంపిక లో పాటించాల్సిన మార్గదర్శకాలను సూచించేందుకు డీఆర్డీవో మాజీ చీఫ్ వీకే ఆత్రే కమిటీని ఏర్పాటు చేసినట్లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. కమిటీ 3 వారాల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని ఫిక్కీ సదస్సులో తెలిపారు. ఆరు కీలక విభాగాల్లో ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు మొదలైనవి ఉంటాయి.