ఎయిర్ ఏషియా డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన బడ్జెట్ ఎయిర్ లైన్ ఎయిర్ ఏషియా జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్స్ లో భాగంగా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం భారీ తగ్గింపు ధరలను సోమవారం ప్రకటించింది. అంతేకాదు విదేశాలను చుట్టి రావాలనుకునే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏషియా భారీ డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. డొమెస్టిక్ గా బెంగళూరు, కొచీ, హైదరాబాద్, న్యూ ఢిల్లీ, గౌహతి, జైపూర్, పూనే, ఇంఫాల్ (అన్ని పన్నుల కలుపుకొని)రూ. 999 నుంచి ప్రారంభమయ్యే కనీస ధరలను ప్రకటించింది. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్, బాలి, ఫుకెట్, మెల్బోర్న్, సిడ్నీ తదితర అంతర్జాతీయ కేంద్రాలకు రూ. 3,599 తక్కువ ధరల్లో టికెట్లను ఆఫర్ చేస్తోంది.
నేడు (అక్టోబర్ 3),16 తేదీల్లో బుక్ చేసుకున్న ఈ విమాన టిక్కెట్ల ద్వారా అక్టోబర్ 4 నుంచి వచ్చే ఏడాది అంటే ఏప్రిల్ 27, 2017 మధ్య ప్రయాణించవచ్చిన ఒక ప్రకటన లోతెలిపింది. ఎయిర్ ఏషియా మలేషియా, ఎయిర్ ఏషియా థాయ్ లాండ్, ఇండోనేషియా, ఫిలప్పీన్స్, భారత్, మధ్య నడిచే విమానాలకు ఈ రేట్లు వర్తించనున్నాయని తెలిపింది. వినియోగదారులకు బెస్ట్ పాజిబుల్ డీల్స్ అందించడమే తమ లక్ష్యమని ఎయిర్ఏషియాచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అమర్ అబ్రోల్ చెప్పారు. ప్రస్తుతం బెంగళూరు, న్యూఢిల్లీ కేంద్రాల ద్వారా , చండీగఢ్, జైపూర్, గౌహతి, ఇంఫాల్, పూనే, గోవా, వైజాగ్, కొచీ, హైదరాబాద్ కవరింగ్ తో 11 గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నామని తెలిపారు.