domestic worker
-
పనిపిల్లపై యజమాని కుటుంబం దాష్టీకం
గురుగ్రామ్: పదమూడేళ్ల పనిపిల్ల పట్ల ఓ ఇంటావిడ దారుణంగా ప్రవర్తించింది. హరియాణాలోని గురుగ్రామ్ పట్టణంలోని సెక్టార్ 51 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనికి కుదిర్చిన వ్యక్తితో కలిసి ఎట్టకేలకు తల్లి.. ఆమె కూతురుని విడిపించుకుంది. తాను అనుభవించిన చిత్రహింసను కూతురు ఏడుస్తూ చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బిహార్‌కు చెందిన ఈమె తన కూతురును జూన్ 27వ తేదీన ఒకావిడ ఇంట్లో పనికి కుదిర్చింది. ఇంట్లో ఉంచుకుని, పనికి నెలకు రూ.9,000 జీతం ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంది. ‘‘ మొదట్లో రెండు నెలలు మాత్రమే నా కుతురుకు జీతం ఇచ్చారు. ఆ తర్వాత చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇంటి పని అంతా చేయించుకుని ఇష్టమొచి్చనట్ట కొట్టేవారు. పెంపుడు కుక్కతో కరిపించేవారు. యజమాని ఇద్దరు కుమారులు నా బిడ్డను లైంగికంగా వేధించారు. బలవంతంగా బట్టలూడదీసి ఫొటోలు, వీడియోలు తీసేవారు. అసభ్యంగా తాకేవారు. యజమానురాలు ఇనుప కడ్డీ, సుత్తితో కొట్టి చిత్రహింసలు పెట్టేది. బయటకు తప్పించుకునిపోకుండా గదిలో బంధించేవారు. కట్టేసి అరవకుండా నోటికి టేప్ అంటించారు. చేతులపై యాసిడ్ పోశారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించేవారు. నా బిడ్డకు రెండు రోజులకు ఒకసారి భోజనం పెట్టేవారు. ఇంతటి దారుణాలు తెలిశాక స్థానిక వ్యక్తితో కలిసి ఎట్టకేలకు ఆ బిడ్డను విడిపించుకున్నా’’ అని టీనేజర్ తల్లి వాపోయారు. -
భానుప్రియకు సమస్యలు తప్పవా?
చెన్నై: నటి భానుప్రియ పనిమనిషి వ్యవహారంలో సమస్యలను ఎదుర్కోకతప్పదా? ఇప్పుడు కోలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ఇదే. భానుప్రియ ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను ఇంటి పనిమనిషిగా పెట్టుకున్న విషయం వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. పనిమనిషిని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె తల్లి సామర్లకోట పోలీస్‌స్టేషన్‌లో భానుప్రియపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ వ్యవహారంపై స్పందించిన భానుప్రియ పనిమనిషి తమ ఇంట్లో రూ.లక్షన్నర విలువ చేసే 30 కాసుల బంగారాన్ని దొంగిలించిందని, వాళ్ల అమ్మ వాటిని తిరిగి ఇస్తానని చెప్పి ఇప్పుడు తమపైనే ఆరోపణలు చేస్తోందని వివరణ ఇచ్చారు. ఈ చోరీ వ్యవహారం, వేధింపుల విషయం ఎలా ఉన్నా బాలికను పనిలో పెట్టుకోవడం నేరం అవుతుంది. ఇది బాలకార్మిక చట్టం ప్రకారం అలాంటి వారిపై 2 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేలజరిమానా పడే అవకాశం ఉంది. తాను ఏజెంట్ ద్వారా పనిపిల్లను నియమించుకున్నానని, అందువల్ల ఆ పిల్ల వయసు తెలియలేదని చెప్పారు. దీన్ని పోలీసులు, బాల కార్మిక చట్టం పరిధిలోకి తీసుకుంటుందా? ప్రస్తుతం పనిమనిషిని నటి భానుప్రియ ఇంటి నుంచి పోలీసులు విడిపించి బాలల సంరక్షణ విభాగానికి అప్పగించారు. అనంతరం ఆ బాలిక వాంగ్మూలం తీసుకుని తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. నటి భానుప్రియ ఈ సమస్య నుంచి బయట పడతారా? లేక జరిమానాకు గురవుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
నమ్మకంగా పని చేసి కొల్లగొడతాడు...
బీహార్‌లో పాతనేరస్తుడి అరెస్టు సొత్తు స్వాధీనం హైదరాబాద్: వ్యాపారి ఇంట్లో నమ్మకం పని చేస్తున్నట్టు నటించి రూ. 10 లక్షల విలువైన సొత్తు ఎత్తుకెళ్లిన పాతనేరస్తుడిని ఎస్సార్ నగర్ పోలీసులు బీహార్‌లో అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... బీహార్ రాష్ట్రం రాజ్మణి గ్రామానికి చెందిన శివనాథ్ ముఖియా (21) పాతనేరస్తుడు. సంపన్నుల ఇళ్లల్లో పని మనిషిగా చేరి, అదను చూసుకొని యజమాని ఇంట్లో నగలు, నగదు దొంగిలించుకుపోవడం ఇతడి నైజం. గతంలో ఇతనిపై బంజారాహిల్స్, సికింద్రాబాద్ మారేడ్‌పల్లి, సైఫాబాద్ పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయి. మూడు నెలల క్రితం తెలిసిన వారి ద్వారా బల్కంపేట ప్రశాంతినగర్ కాలనీకి చెందిన వ్యాపారి లక్ష్మీనారాయణ తైన్వాలా ఇంట్లో పనికి కుదిరాడు. శివనాథ్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలు తెలుసుకోకుండానే లక్ష్మీనారాయణ ఇతడిని పనిలో పెట్టుకున్నారు. నమ్మకం పని చేస్తున్నట్టు నటించిన శివనాథ్ ఒక రోజు యజమాని ఇంటి తాళాలను చోరీ చేసి వాటికి నకిలీ తాళాలు చేయించాడు. మూడు నెలలు నమ్మకంగా పని చేసిన శివనాథ్ ఈ నెల 18న యజమానులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి వెళ్లగా నకిలీ తాళాలతో ఇంట్లోకి ప్రవేశించి 20 తులాల బంగారు నగలు, 3 వజ్రాలతో కూలిన ఆభరణాలు, 20 తులాల వెండి, 2 సెల్ఫోన్లు, రూ. 2.3 లక్షల నగదు తీసుకుని పరారయ్యాడు. సీసీ కెమెరా పుటేజీల ద్వారా ఈ చోరీ శివనాథ్ చేసినట్టు నిర్ధారించుకున్న పోలీసులు అతడి వివరాలు ఏమీ లేకపోవడంతో బీహార్‌కు చెందిన కొంత మందికి సీసీ కెమెరా ఫుటేజీ చూపించి నేరస్తుడి ఆచూకీ కనుగొన్నారు. బీహార్‌కు వెళ్లి... ఎస్సార్ నగర్ డీఐ సతీష్, ఎస్సై జి.శ్రీనివాస్ బృందం బీహార్‌కు వెళ్లింది. నిందితుడు శివనాథ్ నివాసం బందిపోట్లు ఉండే ప్రాంతంలో ఉండటంతో బీహార్ పోలీసులతో కలిపి 40 మంది పోలీసులు వెళ్లి దాడి చేశారు. నిందితుడిని అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శివనాథ్‌ను నగరానికి తీసుకొచ్చి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఇతడిపై పీడీ యాక్స్ ప్రయోగించనున్నట్టు డీసీపీ తెలిపారు.