ఆస్తి కోసం కొట్లాట
కర్నూలు(కృష్ణగిరి): ఆస్తి కోసం సొంత అన్నదమ్ములే కొట్లాటకు దిగిన సంఘటన కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం బోయపొంతిరాళ్లలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగన్న, లక్ష్మణ్ అనే అన్నదమ్ముల మధ్య గత కొంత కాలంగా ఆస్తికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఈ విషయంలో పలుమార్లు తాగాదాలు పెట్టుకున్న అన్నదమ్ములు ఈ రోజు కొట్లాటకు దిగారు.
కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో రాజన్న కుమారులు భాస్కర్, రామంజికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని డోన్ ఆస్పత్రి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.