గాడిద మీద ఊరేగిన హీరో
వెర్రి వెయ్యివిధాలు అంటారు. సాధారణంగా ఏవైనా పెద్ద ఫంక్షన్లు ఉంటే కొంతమంది గుర్రాల మీద ఊరేగడం గానీ, గుర్రపు బండిలో రావడంగానీ మనం చూస్తాం. కానీ.. మాడ్రిడ్‌లో జరిగిన ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమానికి వచ్చిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ను చూస్తే అక్కడి వాళ్లందరికీ నవ్వు వచ్చింది.. విమర్శకులు తల పట్టుకున్నారు. తెల్లటి గాడిదను చక్కగా అలంకరించి దానికి పట్టు బాలీసులు కూడా తొడిగి, దాని మీద హీరోగారిని కూర్చోబెట్టారు. అలా గాడిద మీద ఊరేగుతూనే షాహిద్ ఐఐఎఫ్ఏ అవార్డుల ఫంక్షన్‌కు వచ్చారు.
ఈసారి బాజీరావు మస్తానీకి ఏకంగా 12 అవార్డులు వచ్చాయి. ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ, ఉత్తమ నటుడిగా రణ్వీర్ సింగ్ ఎంపికయ్యారు. దమ్ లగాకే హైసా సినిమాకు నాలుగు అవార్డులు వచ్చాయి. షాహిద్ కపూర్, ఫర్హాన్ అఖ్తర్‌లు హోస్టులుగా వ్యవహరించగా.. దీపికా పదుకొనే, సోనాక్షి సిన్హా, ప్రియాంకా చోప్రా తమ పెర్ఫార్మెన్సులతో అదరగొట్టారు. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ల డాన్సులలో ఎనర్జీ లెవెల్స్ అదిరిపోయాయి.