మక్లూర్లో వ్యక్తి దారుణ హత్య
నిజామాబాద్(మక్లూరు): నిజామాబాద్ జిల్లా మక్లూరు మండల శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. శనివారం పంట పొలాల్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఒంటిపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. మృతుడు నిజాంబాద్ రూరల్ ముల్కాపూర్కు చెందిన దోసపాటి నారాయణ(34) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.