Doubles ranking
-
వరుసగా రెండో ఏడాది నంబర్‌వన్‌గా ముగింపు
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకింగ్‌సలో వరుసగా రెండో ఏడాదిని నంబర్ వన్‌గా ముగించింది. సీజన్ ముగింపు డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సానియా సెమీస్‌లో ఓడింది. అరుుతే మకరోనా-వెస్నినా జోడీ ఈ టోర్నీలో టైటిల్ గెలవడం సానియాకు కలిసొచ్చింది. ఒకవేళ ఫైనల్లో బెథాని-సఫరోవా జోడీ టైటిల్ గెలిచి ఉంటే సానియా టాప్‌ర్యాంక్ పోరుు ఉండేది. బెథానికి అగ్రస్థానం దక్కేది. ‘వరుసగా రెండో ఏడాది నంబర్‌వన్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఇదో గొప్ప గౌరవం’ అని సానియా పేర్కొంది. -
సానియా 81వ వారం..
లండన్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్‌సలో భారత స్టార్ సానియా మీర్జా వరుసగా 81వ వారం కూడా తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్‌సలో సానియా 7815 పారుుంట్లతో అగ్రస్థానంలో ఉంది. మహిళల డబుల్స్‌లో వరుసగా అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా ఉన్న క్రీడాకారిణుల జాబితాలో సానియా నాలుగో స్థానంలో ఉంది. మార్టినా నవ్రతిలోవా (181 వారాలు), కారా బ్లాక్ (145 వారాలు), లీజెల్ హుబెర్ (134 వారాలు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.