మున్సిపల్ ప్రచార హోరు
మార్కాపురం, న్యూస్‌లైన్: మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థినిగా వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ బుధవారం ఉదయం స్థానిక రాఘవేంద్ర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, జంకె వెంకటరెడ్డి, సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి, పట్టణ కన్వీనర్ బట్టగిరి తిరుపతిరెడ్డిల నేతృత్వంలో గడపగడపకూ తిరిగారు. ఈ సందర్భంగా కనకదుర్గ మాట్లాడుతూ పట్టణంలోని సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. శివారు ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సాగర్ నీటిని అందించేందుకు కృషి చేస్తానన్నారు. కేపీ, జంకె, వెన్నా హనుమారెడ్డిల సహకారంతో పట్టణాభివృద్ధికి సమగ్ర ప్రణాళికను తయారు చేసి జిల్లాలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పశ్చిమ ప్రకాశం అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీని గెలిపించి ఆయన రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం సీమాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మారుస్తానని తెలిపారు. పాత బస్టాండ్, మార్కెట్ సెంటర్ , నెహ్రూబజార్, కంభం రోడ్డు మీదుగా ర్యాలీ సాగగా.. ప్రజలు హారతులిచ్చి పూలతో స్వాగతం పలికారు. మార్కెట్ యార్డు చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ సీపీ రూరల్ కన్వీనర్ గాయం కొండారెడ్డి, మండల యూత్ కన్వీనర్ మందటి మహేశ్వరరెడ్డి, నాయకులు పి.సుబ్బారెడ్డి, ఆర్ . తిరునారాయణ, చిర్లంచర్ల కృష్ణ, గుంటక వెంకటరెడ్డి, నికరంపల్లి సర్పంచ్ జంకె కృష్ణారెడ్డి, కురాటి చెన్నకేశవులు, పంబి వెంకటరెడ్డి, ఆదామ్, కరీముల్లా, బొగ్గరపు శేషయ్య, బి.రాంప్రకాశ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
టీడీపీ ప్రచారం
టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థిని వక్కలగడ్డ రాధికతో కలిసి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి బుధవారం తేరు బజార్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో చంద్రబాబు హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని తెలిపారు. తాను ప్రతిపక్ష శాసనసభ్యునిగా ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పుకున్నారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, ఇమ్మడి కాశీనాథ్ , వక్కలగడ్డ మల్లికార్జున్, ఉప్పు రమణ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అద్దంకిలో..
అద్దంకి, న్యూస్‌లైన్: నగర పంచాయతీ నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగియడంతో బుధవారం నుంచి ప్రచార పర్వానికి తెర లేచింది. పట్టణంలోని 14వ వార్డు నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న జాగర్లమూడి శ్రీలక్ష్మి కొత్తపేట నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటి కీ తిరిగి ఓటు వేయాలని అభ్యర్థించారు. వార్డు సమస్యలను పరిష్కరిస్తానన్నారు. సుమారు 150 మంది మహిళలు ప్రచారంలో పాల్గొనటం విశేషం. కార్యక్రమంలో చుండూరి మురళీసుధాకర్, వైఎస్ఆర్ సీపీ పట్టణ సేవాదళ్ కన్వీనర్ ఏలూరి రామ్మోహనరావు, గుంజి హనుమంతరావు, గుంజి ఏడుకొండలు, గుంజి కొండలు, గోపి, షేక్ మాబు, మస్తాన్‌వలి, ఇస్మాయిల్, జోసఫ్, అబ్దుల్ రహమాన్, కె. పేరయ్య, అద్దంకి ఏడుకొండలు, ఆదినారాయణ, ముంతాజ్, సుబ్బారావమ్మ, మీరాబి, అమీదా, ఖాదర్‌బీ, మద్దు అరుణ, హేమలత, నాగేంద్రం,లక్ష్మి పాల్గొన్నారు.
పనిచేస్తాం..ఆదరించండి
చీరాల రూరల్, న్యూస్‌లైన్: వార్డుల్లోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చీరాల మున్సిపాలిటీలోని 8,12,19,30 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు విస్తర్ల జయరాణి, కర్నేటి వెంకటరత్నం, మించల శివ, కొప్పుల నాగేశ్వరరావులు హామీ ఇచ్చారు. బుధవారం వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. తమ పార్టీని ఆదరించాలని అభ్యర్థించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రం అధ్వానంగా తయారైందని, సంక్షేమ ఫలాలు సక్రమంగా అందక ప్రజలు నానా కష్టాలు పడుతున్నారన్నారు. ఆయన తనయుడు నిర్మించిన వైఎస్ఆర్సీపీని ఆదరిస్తే సమస్యలు కొలిక్కి వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా అధికార ప్రతినిధి శీలం వెంకటేశ్వరమ్మ, కర్నేటి రవికుమార్, నరాల తిరుపతి రాయుడు, మేడిద రత్నకుమార్, గందం చంద్ర, షేక్ రజియ, కార్యకర్తలు పాల్గొన్నారు.