నాపై కేసును కొట్టేయండి
హైకోర్టులో ప్రొఫెసర్ లక్ష్మి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: గైనకాలజీ పీజీ విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ గుంటూరు జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, దీనిని కొట్టేసేంత వరకు ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ ఆమె గురువారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇందులో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నగరంపాలెం ఎస్హెచ్వో, సంధ్యారాణి భర్త డాక్టర్ సి.హెచ్.రవిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.