Dr. Srinivas
-
జూడాలు X సర్కార్!
నిరసన జెండాలు మోస్తున్నారు... న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ నెలరోజులకుపైగా రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. పాలకులు పట్టించుకోవడం లేదని కోర్టు మెట్లూ ఎక్కారు. విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సామరస్య పూర్వకంగా పరిష్కరించాల్సిన సర్కార్ పట్టుదలకు పోవడంతో సమస్య జటిలమవుతోంది. సమ్మె కారణంగా వైద్య సేవలందకపోవడంతో నిరుపేదలు అవస్థలు పడుతున్నారు. ఎవరో ఒకరు మెట్టు దిగకపోతే పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో తెలియని అయోమయం నెలకొంది. జూనియర్ డాక్టర్ల ఆందోళనపై ‘సాక్షి’ విశ్లేషణాత్మక కథనం... - సాక్షి జర్నలిజం స్కూల్ విద్యార్థులు * వైద్య సేవలందక నలిగిపోతున్న పేదలు * నెల రోజులు దాటినా ఆగని జూడాల ఆందోళన * రూరల్‌లో ఖాళీల భర్తీ డిమాండ్‌పై దిగని మెట్టు * కఠిన చర్యలకు సిద్ధమవుతున్న సర్కార్! * బెదిరేది లేదంటున్న జూడాలు * కీలకం కానున్న హైకోర్టు తీర్పు నాటి జూడాల పోరాటానికి వైఎస్సార్ బాసట.. 2003 ప్రాంతంలో అప్పటి సర్కార్ ప్రభుత్వాసుపత్రుల్లో యూజర్ చార్జీలు విధించింది. వాటిని రద్దు చేయూలంటూ జూడాలు 2003 డిసెంబర్ 19 నుంచి 2004 జనవరి 29వరకు సుమారు 40 రోజులపాటు పోరాటం చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వీరి పోరాటానికి మద్దతు పలికారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ యూజర్ చార్జీలను రద్దు చేశారు. వైఎస్సార్ చలువ వల్లే నేటికి ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుతోంది. ప్రభుత్వ వైద్య విద్యాసంస్థలైన ఎయిమ్స్, జిప్వుర్లో జూనియర్ డాక్టర్లకు రూ.50 వేల నుంచి రూ.60 వేలు, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లో రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు స్టైపెండ్ ఇస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని అధిగమించాలని ప్రభుత్వాన్ని జూడాలు కోరుతున్నారు. జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టి నెల రోజులు దాటినా వారి ఆందోళనకు పుల్‌స్టాప్ పడడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది సర్వీసు చేయాలన్న నిబంధనను సడలించి ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని కోరుతున్నారు. అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని అడగడం లేదని, ఖాళీలను భర్తీ చేయూలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని జూడాలు చెబుతున్నారు. ఈ విషయంలో సర్కార్ సానుకూలంగా స్పందించక పోవడం వల్లే సమస్య జటిలంగా మారుతోందని జూడాలు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా నియామకాలు చేపట్టకపోగా, జూడాలను డిబార్ చేసేందుకు సర్కార్ సిద్ధపడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భావి భారత డాక్టర్లపై ఎస్మా ప్రయోగించడానికైనా వెనుకాడబోవుని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2012లో ఇచ్చిన వేతన పెంపు హామీని నెరవేర్చకుండా జూడాలకు ప్రమాద సంకేతాలు పంపుతోంది. ఇదిలావుంటే ‘వైద్య వృత్తి గువూస్తా ఉద్యోగం లాంటి ది కాదు, గౌరవప్రదమైనది. రాజకీయ విభేదాలతో నిరసనలు చేపడుతున్నారేమో ఆత్మపరిశీలన చేసుకోండి’ అని హైకోర్టు జూడాలనుద్దేశించి వ్యాఖ్యానించింది. కోర్టు వ్యాఖ్యలు తమకు అనుకూలంగా ఉన్నాయంటూ సర్కార్ జూడాల పట్ల కాస్త కఠిన వైఖరిని అవలంబించేందుకు సమాయత్తమవుతోంది. ప్రధాన డిమాండ్లు.. ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలి. 107 జీఓను రద్దు చేయూలి. తమతో చర్చించిన తర్వాతే కొత్త జీఓ తేవాలి. స్టైపెండ్ పెంపు. వైద్యులకు ప్రత్యేక రక్షణ సిబ్బంది. లైబ్రరీల అప్‌గ్రేడ్, గ్రామీణ ప్రాంతాల్లో నివాస వసతి. అసలు సమస్య ఇదే.. జూడాలను గ్రామీణ సర్వీసుల్లో శాశ్వత ప్రాతిపదికన నియమించాలనే డిమాండే ప్రధానంగా మారింది. మిగతా డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుకు వచ్చిన సర్కార్ ఈ డిమాండ్‌పై మాత్రం మెట్టు దిగడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి అభ్యంతరం లేదని జూడాలు స్పష్టం చేస్తున్నారు. గ్రామీణ సేవలు అందించినందుకు తమకు ప్రత్యేక సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. పోస్టులు భర్తీ చేసేటప్పుడు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూ చిస్తున్నారు. ఏటా 600 మంది వైద్యులు గ్రామీణ సర్వీసుల నుంచి బయటికి వస్తున్నారని వారు చెబుతున్నారు. గత పదేళ్లలో రెండు సార్లు మాత్రమే నియామకాలు జరిగాయంటున్నారు. అప్పుడలా.. ఇప్పుడిలా... జూడాలు 2012లో ఉద్యమించినప్పుడు వారికి అండగా నిలిచిన కేసీఆరే ఇప్పుడు సమ్మెను అణగదొక్కాలని ప్రయుత్నిస్తున్నారని జూడాల ఆరోపణ. ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీని గద్దెనెక్కాక మాటవూర్చిందని వారంటున్నారు. ఏదిఏమైనా అటు జూడాలు, ఇటు సర్కార్ మెట్టుదిగక పోవడంతో వైద్య సేవలందక నిరుపేద రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కార మార్గం చూపాలని పలువురు కోరుతున్నారు. డిమాండ్లు అంగీకరిస్తే సమ్మె విరమిస్తాం.. ‘రూరల్ సర్వీసు’ సవుస్యను పరిష్కరిస్తే భవి ష్యత్తులో సమ్మెలు చేయుం. జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందన్న నెపంతో ప్రభుత్వం మా డిమాండ్‌ను అంగీకరించడం లేదు. 107 జీఓ రద్దు చే సి కొత్త జీఓ తీసుకురావాలి. ఈ జీఓలోని మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం పాటించడం లేదు. - డా. శ్రీనివాస్, జూడాల సంఘం అధ్యక్షుడు అవగాహనకే సరిపోతుంది.. ఏడాదిలో మూడు నెలలు కౌన్సెలింగ్‌కు పోతే 8 నెలలు మాత్రమే సర్వీసు చేస్తున్నాం. స్థానికుల భాష, ఆరోగ్య పరిస్థితులను అవగాహన చేసుకోవడానికే ఆ సమయం సరిపోతోంది. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిం చినపుడు మా డిమాండ్ తెలుసుకోకుండా సమ్మె విరమిస్తారా? లేదా అని వుంత్రి ప్రశ్నించారు. - మనోజ్, జూడా రూరల్ సర్వీస్‌కు వ్యతిరేకం కాదు.. 1,300 రూరల్ సర్వీసు పోస్టులకు 16వేల మంది ఆసక్తి చూపారంటే అర్థం చేసుకోండి. రూరల్ సర్వీసుకు మేం సిద్ధమే. శాశ్వత నియామకాలు చేపట్టాలి. డీఎంఈ వల్లే సమస్య జటిలం. సమ్మెను తప్పుదారి పట్టిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చొరవ చూపితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. - స్వప్నిక, జూడా ఉస్మానియా -
పక్కదోవ పట్టించేందుకే చర్చలు: జూడాలు
హైదరాబాద్: ప్రభుత్వం మొండివైఖరి వీడి ప్రధాన డిమాండ్‌ను పరిష్కరించాలని జూడాల అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జూడాల ఆందోళనలో భాగంగా మంగళవారం 16వ రోజు కోఠి డీఎంహెచ్ఎస్ వద్ద పండ్లు అమ్ముతూ, ప్రభుత్వ వాహనాలు తుడుస్తూ వినూత్న నిరసన తెలిపారు. అనంతరం డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ పుట్టా శ్రీనివాస్ ఆహ్వానించడంతో జూడాలు రెండుగంటలపాటు చర్చలు జరిపినా విఫలవుయ్యాయి. జూడాల పలు డిమాండ్లకు ప్రభుత్వం సుముఖంగా ఉందని డీఎంఈ తెలిపారు. హౌజ్సర్జన్లకు సమానంగా వేతనాలు చెల్లిస్తామని, ప్రభుత్వ ఆసుపత్రులలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిపాటు పనిచేయాలన్న నిబంధనను తీసివేయుడం సాధ్యం కాదన్నారు. కాగా పర్మనెంట్ చేస్తే గ్రామాల్లో పనిచేస్తామనే డిమాం డ్‌ను డీఎంఈ పక్కదోవ పట్టిస్తున్నారని జూడాల అధికార ప్రతినిధులు స్వప్నిక, నరేశ్ దుయ్యబ ట్టారు. ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధి ఉంటే తవు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
కలలు కందాం... నిజం చేసుకుందాం
►ఉద్యోగాల కోసమే చదువులొద్దు ►మానవాళి మనుగడ మన కర్తవ్యం ►పరిశోధన పత్రాలు...ప్రగతికి బాటలు ►భావితరాలకు శాస్త్రవేత్తలను అందిద్దాం ►జాతీయ జీవశాస్త్ర సదస్సు పిలుపు సిద్దిపేట టౌన్: ‘సృష్టిలోని పక్షులు, జంతువులు, వృక్షాలు మానవాళి మనుగడకు పునాదులు. వీటిని రక్షించుకోవాల్సింది పోయి నిర్మూలిస్తున్నాం. ఇది భావితరానికి శాపంగా మారుతోంది’ అని జాతీయ జీవశాస్త్ర సదస్సు పేర్కొంది. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరుగుతుంది. సదస్సులో ఉస్మానియా యూనివర్సిటీ జీవశాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ శ్రీనివాసులు కీలకోపన్యాసం చేశారు. ప్రకృతిలోని ప్రతి ప్రాణి ముఖ్యమేనన్నారు. విచక్షణారహితంగా ప్రకృతిని నాశనం చేయడం అవాంఛనీయమన్నారు. ధనదాహానికి అరుదైన పక్షులు, జంతువులు, వృక్షాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గబ్బిలాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ మూఢ నమ్మకాలతో వాటిని అపశకునంగా భావిస్తున్నామన్నారు. ఉద్యోగాల కోసం ఉన్నత చదువులు సరికాదన్నారు. రేపటి తరాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఇందుకోసం కలలు కనాలని వాటిని నిజం చేసుకోవడానికి అంకితభావంతో కృషిచేయాలని సూచించారు. సినిమాలు, మీడియాల వల్ల మూఢ నమ్మకాలు పెరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ మాట్లాడుతూ భావితరానికి శాస్త్రవేత్తలను అందించాలన్నారు. సంక్షోభాలను ఎదుర్కోవడానికి దీటైన పరిశోధనలు చేయాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జీఎం రామశర్మ మాట్లాడుతూ నిరంతర అధ్యయనంతో సమాజం పురోగమిస్తుందన్నారు. కొత్త కోణాల నుంచి ఆవిష్కరణలు జరగాలన్నారు. పరిశోధనలతోనే సంక్షోభాల నిర్మూలన రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు డాక్టర్ పాపయ్య మాట్లాడుతూ శాస్త్రవేత్తల పరిశోధనల వల్లే ప్రపంచాన్ని గడగడలాడించిన ప్లేగు, మశూచి మొదలగు వ్యాధులను నిర్మూలించారన్నారు. శాస్త్ర పరిశోధనలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడుతోందన్నారు. భావి శాస్త్రవేత్తలు సమర్పించే పరిశోధన పత్రాలు రేపటి సమాజాన్ని రక్షించే బాటలుగా మారుతాయన్నారు. ఎస్బీహెచ్ జనరల్ మేనేజర్ స్వర్ణలత రామకృష్ణన్, శ్రీకృప ఫార్మసి ప్రిన్సిపాల్ కార్తికేయన్, సదస్సు కో కన్వీనర్ డా. శ్రీనివాస్‌రెడ్డి, అకాడమిక్ కో ఆర్డినేటర్ గోపాలసుదర్శన్, సదస్సు నిర్వహణ కమిటీ ప్రతినిధులు అయోధ్యరెడ్డి, హరినాథశర్మ, రమేష్‌బాబు, రాజుకుమార్, ఏవీ శర్మ, ఎం. శ్రీనివాస్ పాల్గొన్నారు.