పక్కదోవ పట్టించేందుకే చర్చలు: జూడాలు
హైదరాబాద్: ప్రభుత్వం మొండివైఖరి వీడి ప్రధాన డిమాండ్‌ను పరిష్కరించాలని జూడాల అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జూడాల ఆందోళనలో భాగంగా మంగళవారం 16వ రోజు కోఠి డీఎంహెచ్‌ఎస్ వద్ద పండ్లు అమ్ముతూ, ప్రభుత్వ వాహనాలు తుడుస్తూ వినూత్న నిరసన తెలిపారు. అనంతరం డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ పుట్టా శ్రీనివాస్ ఆహ్వానించడంతో జూడాలు రెండుగంటలపాటు చర్చలు జరిపినా విఫలవుయ్యాయి. జూడాల పలు డిమాండ్లకు ప్రభుత్వం సుముఖంగా ఉందని డీఎంఈ తెలిపారు.
హౌజ్‌సర్జన్‌లకు సమానంగా వేతనాలు చెల్లిస్తామని, ప్రభుత్వ ఆసుపత్రులలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిపాటు పనిచేయాలన్న నిబంధనను తీసివేయుడం సాధ్యం కాదన్నారు. కాగా పర్మనెంట్ చేస్తే గ్రామాల్లో పనిచేస్తామనే డిమాం డ్‌ను డీఎంఈ పక్కదోవ పట్టిస్తున్నారని జూడాల అధికార ప్రతినిధులు స్వప్నిక, నరేశ్ దుయ్యబ ట్టారు. ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధి ఉంటే తవు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.