House Surgeon
-
భారత్‌లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్ విక్టోరియా జోక్యంతో..
భారత్‌లోని తొలి విడాకులు కేసు లేదా విడాకులు తీసుకున్న మొట్టమొదటి హిందూ మహిళ ఆమె. ఆమె విడాకుల కేసులో ఏకంగా బ్రిటన్ క్వీన్ జోక్యంతో తనకు అనుకూలంగా తీర్పు పొందింది. ఆ రోజుల్లో దీన్ని అందరూ విమర్శించినా..ఒంటరిగానే మహిళల హక్కుల కోసం పోరాడింది. పైగా పాశ్చాత్య వైద్యంలో సర్జన్‌గా ప్రాక్టీస్ చేసిన తొలి వైద్యురాలు కూడా ఈమెనే కావడం విశేషం. ఇంతకీ ఎవరామె..? ఆ కాలంలో అంతటి తెగువను ఎలా పదర్శించ గలిగిందంటే..?ఇది 1885లో జరిగిన ఘటన. చెప్పాలంటే భారత్లొని మొట్టమొదటి విడాకులు కేసు(Divorce Case) లేదా విడాకుల తీసుకున్న తొలి హిందు మహిళగా చెప్పొచ్చు. ఆ మహిళ పేరు రఖ్మాబాయి రౌత్. విడాకులు అనే పదం మన దేశంలో కనిపించే అవకాశం లేని రోజులవి. అలాంటి రోజుల్లో ధైర్యంగా కోర్టులో పోరాడి విడాకులు తీసుకుందామె. రఖ్మాబాయికి కేవలం 11 ఏళ్ల ప్రాయంలోనే దాదాజీ భికాజీ అనే 19 ఏళ్ల అబ్బాయితో వివాహం జరిగింది. అయితే ఆమె మెడిసిన్ చదవాలనే తపనతో తన తల్లిదండ్రుల వద్దే ఉండేది. అక్కడే తన చదువుని కొనసాగించింది కూడా. అయితే ఇది ఆమె భర్తకు నచ్చక తన వద్దే ఉండాలని పట్టుబట్టాడు. అందుకు రుఖ్మాబాయి నిరాకరించింది. దీంతో అతడు ఆమెపై కేసు పెట్టాడు. అయినా ఏ మాత్రం భయపడకుండా కోర్టులో ధైర్యంగా తన వాదన వినిపించింది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాని, అందువల్ల తనతో కలిసి జీవించలేనని నిర్భయంగా చెప్పింది. ఈ విషయం ఊరంతా దావానంలా వ్యాపించడమే గాక, చదువే ఆమెను భ్రష్టుపట్టించిందని ప్రజలంతా ఆమెను ఆడిపోసుకునేవారు. అయితే కోర్టు.. రుఖ్మాబాయిని భర్తతో కలిసి ఉండకపోతే జైలులో ఆరు నెలలు ఉండాల్సి వస్తుందని తీర్పు ఇచ్చింది. అయితే ఆమె ఆశ్చర్యకరంగా జైల్లో ఉండేందుకు మొగ్గు చూపింది. అలా ఆమె జైల్లో శిక్షను అనుభవిస్తూనే 'ఎ హిందూ లేడీ' అనే పేరుతో లింగ సమానత్వం, సామాజిక సంస్కరణలు, మహిళల హక్కులు మొదలైన వాటి గురించి రాశారు. ఆమె రచనలు క్వీన్ విక్టోరియా(Queen Victoria) దృష్టికి రావడమే గాక అవి ఎంతగానో ఆమెను ఆకర్షించాయి. దీంతో ఆమె రఖ్మాబాయి కేసులో జోక్యం చేసుకుని మరీ ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసింది. అలాగే విడాకులు కూడా మంజూరయ్యేలా చేశారామె. మహిళలను హేళనగా చూసే ఆ రోజుల్లో అత్యంత సాధారణ మహిళగా ఆమె సాధించిన మొట్టమొదటి విజయం. అయితే ఆ తర్వాత ఆమె లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్‌లో చదవాలని నిర్ణయించుకుంది. అలా 35 ఏళ్ల పాటు సూరత్‌లోని ఉమెన్స్ హాస్పిటల్ చీఫ్‌గా పనిచేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. చెప్పాలంటే పాశ్చాత్య వైద్యంలో హౌస్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేసిన తొలి మహిళ రుఖ్మాబాయి. అంతేగాదు ఆమె కారణంగానే భారత్‌లో బాల్యవివాహాలపై చర్చలు, వ్యతిరేకించడం ఊపందుకున్నాయి. అలాగే మహిళలు దీనిపై పోరాటం చేసేందుకు ముందుకొచ్చేలా ప్రేరణనిచ్చింది ఆమె గాథ. (చదవండి: స్వతహాగా శాకాహారి కానీ ఆ ఫేమస్ రెసిపీ కోసం..!) -
రైలుబండిలో ప్రసవం
అనకాపల్లి టౌన్: సికింద్రాబాద్–విశాఖ దురంతో రైల్లో పండంటి ఆడ శిశువుకు ఓ తల్లి జన్మనిచ్చింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నాంకు చెందిన పి.సత్యవతి.. భర్త సత్యనారాయణతో కలిసి బీ–6 ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న సత్యనారాయణ భార్యను డెలివరీ నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళుతున్నారు. సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ స్టేషన్లో రైలెక్కారు. మంగళవారం వేకువజామున రైలు రాజమండ్రి స్టేషన్ దాటుతుండగా సత్యవతికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. సత్యనారాయణ టికెట్ కలెక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అనకాపల్లిలో రైలు ఆపేందుకు చర్యలు చేపట్టారు. ఇంతలో నొప్పులు మరింత పెరిగాయి. దీంతో అదే బోగీలో ప్రయాణిస్తున్న హౌస్‌సర్జన్ స్వాతిరెడ్డి అదే బోగీలో ప్రయాణిస్తున్న మహిళల సాయంతో సుఖప్రసవం చేశారు. ఈలోగా రైలు అనకాపల్లి రైల్వేస్టేషన్ చేరుకుంది. 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. -
మానసను బలిగొంది ప్రేమా? ఉన్మాదమా?
సరదా స్నేహాలు.. విపరీత అనర్థాలకు దారితీస్తున్నాయి. యుక్తవయసులో తెలిసీ తెలియక చేస్తున్న పనులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆకర్షణతో ఒకరికపై ఒకరు పెంచుకుంటున్న ‘ప్రేమ’ అనే ఫీలింగ్.. చివరకు విషాదాన్ని మిగులుస్తోంది. కేరళలో జరిగిన మానస హత్య ఘటన ‘ప్రేమోన్మాదం’ చర్చను మరోసారి తెర మీదకు తెచ్చింది. కొచ్చి: Dental Hose Surgeon మానస హత్య కేసు ప్రస్తుతం కేరళను కుదిపేస్తోంది. పట్టపగలే ఇంట్లోకి చొరబడి మరీ మానసను తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు.. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు.. మరిన్ని వివరాలను సేకరించారు. కొచ్చికి 35 కిలోమీటర్ల దూరంలో కొత్తమంగళం దగ్గర నెల్లికులిలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఇదసలు ప్రేమా? ఉన్మాదమా? అనే అంశంపై యువతలో సోషల్ మీడియాలో, ముఖ్యంగా క్లబ్‌హౌజ్‌లో ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. బ్రేకప్‌కి ఏడాది పీవీ మానస(24) స్వస్థలం కన్నూర్. ఇందిరా గాంధీ కాలేజీలో డెంటల్ కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతోంది. అక్కడే స్నేహితురాల్లతో రూమ్‌లో ఉంటోంది. ఇక రాఖిల్(32?) కూడా అదే జిల్లాకు చెందిన వాడు. ఏడాది క్రితం ఈ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. ఆపై ప్రేమలో పడ్డారు. అయితే నెల క్రితం మానస, రాఖిల్‌కు బ్రేకప్ చెప్పింది. దీంతో రాఖిల్ ఆమెను బతిమాలడం మొదలుపెట్టాడు. కాళ్ల మీద పడ్డాడు. ఈ విషయంపై కన్నూర్ పోలీస్ స్టేషన్లో మానస ‘వేధింపుల ఫిర్యాదు’ చేసింది. ఈ ఫిర్యాదుపై పోలీస్ పంచాయితీ జరగ్గా.. రాఖిల్ పేరెంట్స్ రిక్వెస్ట్‌తో బెదిరించి వదిలేశారు పోలీసులు. దీంతో తన బ్రేకప్ కథకు ముగింపు పలకాలని పక్కా ఫ్లాన్ వేసుకున్నాడు. దగ్గరగా కాల్పులు శుక్రవారం మధ్యాహ్నం కొత్తమంగళంలో మానస ఉంటున్న రూమ్‌కి వెళ్లాడు. ఆమెతో గొడవకు దిగి.. మరో రూంలోకి లాక్కెళ్లాడు. రూమ్ మేట్స్ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వాళ్లను తుపాకీతో బెదిరించి ఆపై మానసపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో కేరళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈమధ్య వరుసగా వరకట్న మరణాలు చోటు చేసుకోడం, అవి మరిచిపోక ముందే మానస ఘటన చోటు చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాఖిల్‌కు తుపాకీ ఎలా దొరికిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
విధి ద్రోణాచార్యుడే! ఆమె ఏకలవ్య కాదు!!
మేరియా ముందు లేడిపిల్ల దిగదుడుపు. ఎం.బి.బి.ఎస్ జాయిన్ అయితే కాలేజీ అంతా తూనీగ ఎగిరినట్టే. ఫస్ట్ ఇయర్ అయ్యింది. హాస్టల్లో బట్టలు ఆరేస్తూ సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడింది. విధి వచ్చి నీ మొత్తం శరీరాన్ని చలన రహితం చేస్తాను అంది. ఆమె అంగీకరించిందా? తల వొంచితే ఈ కథే ఉంటుందా? మొన్నటి అంటే 2021 ఫిబ్రవరి 1న కేరళలోని తొడుపూజ మెడికల్ కాలేజీలో 25 ఏళ్ల మేరియా బిజు హౌస్ సర్జన్‌గా చేరింది. ఆమె ఆ కాలేజీ విద్యార్థినే. ఇప్పుడే అదే కాలేజీలో హౌస్ సర్జన్. అయితే ఈ రెంటికీ నడుమ ఒక పెద్ద పోరాటం ఉంది. సంఘర్షణ ఉంది. గెలుపూ ఉంది. ఎందుకంటే 2015లో అదే కాలేజీలో మెడిసిన్ స్టూడెంట్‌గా చేరిన మేరియా వేరు. మొన్న హౌస్ సర్జన్‌గా డ్యూటీ తీసుకున్న మేరియా వేరు. నాటి మేరియా మోటర్ సైకిల్ మీద తుర్రున దూసుకెళ్లే మేరియా. నేటి మేరియా వీల్‌చైర్‌లో స్థయిర్యంగా చిరునవ్వు నవ్వే మేరియా. ప్రమాదాన్ని ఎదుర్కొని... మేరియాకు డాక్టర్ కావాలని కోరిక. ఇంకా చెప్పాలంటే మంచి సర్జన్ కావాలని కోరిక. అందుకే మెడిసిన్‌లో చేరింది. కొట్టాయంకు దగ్గరగా ఉండే తొడుపూజ మెడికల్ కాలేజీలో ఎన్నో కలలతో అడుగుపెట్టింది. మొదటి సంవత్సరం మంచి మార్కులతో పాస్ అయ్యింది. రెండో సంవత్సరంలో ఉండగా 2016లో జూన్ 5న ఆమెకు ప్రమాదం జరిగింది. హాస్టల్లో బట్టలు ఆరేస్తుండగా కాలు జారి రెండో అంతస్తు మీద నుంచి కింద పడిపోయింది. ‘నా మెడ, తొడ ఎముక విరిగి పోయాయి’ అని చెబుతుంది మేరియా. వెంటనే ఆమెను దగ్గరిలో ఉన్న హాస్పిటల్లో చేర్పించారు. స్థానికంగా ఒక సర్జరీ అయ్యాక వెల్లూరు సి.ఎం.సిలో ఆమె నెలల తరబడి ఉండాల్సి వచ్చింది. ‘నా మెడ కింది భాగమంతా చచ్చుబడింది’ అని చెబుతుంది మేరియా. ఆ సమయంలో ఆమెకు తల్లిదండ్రులు, స్నేహితులు పెద్ద మద్దతుగా నిలిచారు. కాలేజీ యాజమాన్యం కూడా ధైర్యం చెప్పింది. ‘మెడికల్ సీటు అలాగే ఉంటుందని... ఎప్పుడు కోలుకుంటే అప్పుడు తిరిగి వచ్చి చదువుకోవచ్చని’. స్నేహితులే తోడుగా ప్రమాదం జరిగిన కొన్ని నెలల తర్వాత మేరియా కాలేజీకి వీల్‌చైర్ మీద తిరిగి వచ్చింది. కన్నీళ్లు పెట్టుకున్న స్నేహితులకు ధైర్యం చెప్పింది. తాను ధైర్యం తెచ్చుకుంది. ‘అయితే నేను ఎగ్జామ్స్ రాయడమే పెద్ద సమస్య అయ్యింది. నా వేళ్ల మీద కూడా నాకు పట్టు లేదు’ అని చెప్పిందామె. ‘ఎగ్జామ్స్ రాయడానికి లేఖకుణ్ణి పెట్టుకోవచ్చని కాలేజీ వారు చెప్పారు. అయితే మెడికల్ విషయాలుండే పేపర్లు రాయాలంటే సాధారణ వ్యక్తులు సరిపోరు. మరో మెడికోనే తీసుకోవాలి. అందుకు నిబంధనలు ఒప్పుకోవు. కనుక నా వేళ్లను కదిలించి నేనే ఎగ్జామ్ రాయాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది మేరియా. అయితే అది అంత సులువు కాలేదు. ఎంతో శ్రమ పడి, ఫిజియో థెరపీ తీసుకుని ఆమె తను కుడిచేతి వేళ్లను కదిలించగలింది. ‘పెన్ను పట్టుకోగలిగితే చాలు అనుకున్నాను’ అంటుంది మేరియా. 64 శాతం మార్కులతో పాసయ్యి... మేరియా చక్రాల కుర్చీలో కూచునే క్లాసులకు అటెండ్ అయ్యి 64 శాతం మార్కులతో పాస్ అయ్యింది. ఇది ఘన విజయం కింద లెక్క. ఇప్పుడు చదివిన కాలేజీలోనే హౌస్ సర్జన్ చేస్తోంది. ‘నాకు గొప్ప సర్జన్ కావాలని కోరిక ఉండేది. అయితే సర్జరీలు చేయాలంటే వేళ్ల కదలికల మీద మంచి పట్టు ఉండాలి. అది నాకు లేదు. అంతే! ఎం.డి చేద్దామనుకుంటున్నాను’ అంటుంది మేరియా. ఆమె మంచి బొమ్మలు వేస్తుంది. వాటిని కొనేవారు కూడా ఉన్నారు. ‘నాకు ఒక్కదాన్నే కొత్త ప్రదేశాలు తిరగాలని ఉంది. అయితే వీల్‌చైర్ ఫ్రెండ్లీగా మన ప్రదేశాలు ఉండవు’ అంటుందామె. కేరళ ఆర్టిసి వారిని బస్టాండ్లలో వీల్‌చైర్ ర్యాంప్‌ల ఏర్పాటు కోసం కోరింది మేరియా. ఆ సంస్థ అందుకు స్పందించింది. జీవాన్ని, ఆశను కాపాడుకోవడమే మనిషి పని అని మేరియా సందేశం. – సాక్షి ఫ్యామిలీ -
హౌస్ సర్జన్ రితీష్ ఆత్మహత్య
-
షాపింగ్ కు వెళ్లిన హౌస్ సర్జన్ కిడ్నాప్
-
షాపింగ్ కు వెళ్లిన హౌస్ సర్జన్ కిడ్నాప్
* కడపలో అదృశ్యమైన సుస్మిత * దుండగులు ఆటోలో తీసుకెళ్లారని అనుమానాలు * సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలిస్తున్న పోలీసులు కడప అర్బన్: కడప శివార్లలోని రిమ్స్‌లో హౌస్ సర్జన్‌గా విద్యనభ్యసిస్తున్న సుస్మిత నగరంలోని నాగరాజుపేట వద్ద శుక్రవారం రాత్రి కిడ్నాప్‌కు గురయ్యారు. సహచర విద్యార్థులు, పోలీసులు వివరాల మేరకు.. ఆదిలాదాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన కేఎస్ ముత్తన్న కుమార్తె కొత్తూరు సుస్మిత రిమ్స్‌లో ఎంబీబీఎస్ ఫైనలియర్ (హౌస్ సర్జన్) చదువుతోంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు తన సహచర హౌస్ సర్జన్ సాధనారెడ్డితో కలసి నగరానికి ఆటోలో వచ్చింది. నాగరాజుపేటలోని గంగవరం రెసిడెన్సీ సమీపంలో ఉన్న బ్యూటీ పార్లర్ వద్ద సుస్మిత దిగింది. సాధన వైవీ స్ట్రీట్‌లో షాపింగ్ చేసుకుని వస్తానని వెళ్లింది. ఎనిమిది గంటలకు సాధానరెడ్డి సుస్మితకు ఫోన్ చేయగా, తనను ఎవరో కిడ్నాప్ చేశారని.. ఏడుస్తూ మాట్లాడటంతో ఆమె కంగారుపడింది. మరో సారి ఫోన్ చేయగా ‘స్విచ్ ఆఫ్’ అని వచ్చింది. విషయాన్ని సాధన తన సహచర హౌస్సర్జన్లకు చెప్పింది. అనంతరం కడప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఓఎస్డి రాహుల్‌దేవ్ శర్మ, డీఎస్పీ ఇ.జి.అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సెల్‌ఫోన్ టవర్ సిగ్నల్ నాగరాజుపేట వైపు నుంచి పాత బస్టాండు, మరియాపురం, మైదుకూరు వైపు వెళ్లినట్లు సమాచారం. అయితే తనను ఎవరో కిడ్నాప్ చేశారని సుస్మిత నిర్మల్‌లోని తన సోదరునికి చెబుతుండగా మధ్యలో దుండగులు ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. సుస్మిత ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదని, తన పని తాను చేసుకుపోయేదని రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ గిరిధర్ చెప్పారు. -
పసికందు మృతి వివాదాస్పదం
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఓ పసికందు మృతి వివాదాస్పదమైంది. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణం తీసిందని తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రుల అవగాహన లోపమే ప్రాణం పోవడానికి కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. అనంతపురం రూరల్ :నగరంలోని మరువకొమ్మ కాలనీకి చెందిన మహబూబ్‌బాష, అయిషా తమ మూడు నెలల బాలుడు ఏడుస్తున్నాడని ప్రభుత్వ సర్వజనాస్పత్రికి గురువారం తెల్లవారు జామున నాలుగు గంటలకు తీసుకెళ్లారు. చిన్నారికి గురువారం రాణినగర్ ఎంసీహెచ్ సెంటర్లో బీపీటీ టీకా వేరుుంచామని, అప్పటి నుంచి ఏడుస్తోందని వైద్యులకు తెలిపారు. బిడ్డను పరిశీలించిన డాక్టర్ హేమలత పారాసిట్మాల్ సిరప్, ఓ ఆరుుల్మెంట్ రాసి ఇవ్వాలని హౌస్ సర్జన్‌ను ఆదేశించారు. వైద్యులు ఇచ్చిన సిరప్ తీసుకుని 4.15 నిమిషాలకు బిడ్డతో సహ వారు బయటకు బయలుదేరారు. మళ్లీ బాలుడు ఏడవడంతో ఆస్పత్రిలోని పిల్లల వార్డుకు తీసుకెళ్లారు. దీంతో వైద్యురాలు హేమలత అడ్మిషన్‌కు సిఫార్సు చేశారు. ఆ సమయంలో పిల్లర్ ద్వారా బాలుడికి పాలు పట్టించారు. దీంతో బాలుడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో వెంటనే బాలుడిని వార్డులోకి తీసుకెళ్లారు. డాక్టర్ మల్లేశ్వరి అంబు పరికరం ద్వారా కృత్రిమ శ్వాస అందించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో బిడ్డ నోటి వెంట బాలు బయటకు వచ్చారుు. ఉదయం 6.05 నిమిషాలకు బాలుడు మృతి చెందాడు. డీఐఓ డాక్టర్ డేవిడ్ దామోదర్ బాధితులను పరామర్శించారు. మృతి చెందిన విషయంపై ఆరా తీశారు. ఎవరూ పట్టించుకోలేదు ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. సకాలంలో స్పందించి ఉంటే నా బాబు బతికి ఉండేవాడు. తెల్లారుజామునే తీసుకువచ్చాం. మా కర్మకే ఏం చేద్దాం. గతంలోనూ ఇదే ఆస్పత్రిలో మూడు రోజుల మా పాప మృతి చెందింది. ఎవరితో చెప్పుకోవాలి....యా అల్లా.. -మహబూబ్‌బాష, అయిషా ఏడుస్తున్నప్పుడు పాలు పట్టారు సకాలంలో వైద్యం అందించాం. మా తప్పేమి లేదు. గంటన్నర పాటు ప్రయత్నించాం. బాబు ప్రాణం కాపాడేందుకు అన్ని విధాల కృషి చేశాం. బాబు ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్లాయి. అందుకే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. పాలు పట్టించవద్దని ముందుగానే చెప్పాం. - డాక్టర్ హేమలత -
పక్కదోవ పట్టించేందుకే చర్చలు: జూడాలు
హైదరాబాద్: ప్రభుత్వం మొండివైఖరి వీడి ప్రధాన డిమాండ్‌ను పరిష్కరించాలని జూడాల అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జూడాల ఆందోళనలో భాగంగా మంగళవారం 16వ రోజు కోఠి డీఎంహెచ్ఎస్ వద్ద పండ్లు అమ్ముతూ, ప్రభుత్వ వాహనాలు తుడుస్తూ వినూత్న నిరసన తెలిపారు. అనంతరం డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ పుట్టా శ్రీనివాస్ ఆహ్వానించడంతో జూడాలు రెండుగంటలపాటు చర్చలు జరిపినా విఫలవుయ్యాయి. జూడాల పలు డిమాండ్లకు ప్రభుత్వం సుముఖంగా ఉందని డీఎంఈ తెలిపారు. హౌజ్సర్జన్లకు సమానంగా వేతనాలు చెల్లిస్తామని, ప్రభుత్వ ఆసుపత్రులలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిపాటు పనిచేయాలన్న నిబంధనను తీసివేయుడం సాధ్యం కాదన్నారు. కాగా పర్మనెంట్ చేస్తే గ్రామాల్లో పనిచేస్తామనే డిమాం డ్‌ను డీఎంఈ పక్కదోవ పట్టిస్తున్నారని జూడాల అధికార ప్రతినిధులు స్వప్నిక, నరేశ్ దుయ్యబ ట్టారు. ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధి ఉంటే తవు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
విశాఖ కెజిహెచ్లో హౌస్ సర్జన్ల ఆందోళన
-
డాక్టర్ కృష్ణవేణి కేరాఫ్ రైల్వే ప్లాట్‌ఫామ్
సంగెం, న్యూస్‌లైన్ : ‘నా పేరు సయ్యద్ అమీర్ ఎక్బాల్ బేగం. తండ్రి ఎక్బాల్ హుస్సేన్ దుబాయిలో ఉంటాడు. నన్ను పెంచిన సయ్యద్ జాఫీర్ అలీ మీర్జా ఎయిర్ కండిషన్ ఇంజినీర్. జూబ్లీహిల్స్ ప్లాట్ నంబర్ 17, హైదరాబాద్, ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ దగ్గర మా ఇల్లు. స్కూల్ చదువంతా కొత్తగూడెంలో పూర్తి చేశా. బీఎస్సీ నర్సింగ్ సోమాజిగూడలో, ఎంబీబీఎస్ కేఎంసీలో, డీజీఓ సిద్దార్థ కాలేజీ విజయవాడలో చదివాను. వీటీతోపాటు లోయర్, హయ్యర్ టైప్, డీబీహెచ్పీ కోర్సు పూర్తి చేశాను. నేను మస్లిం అయినా హౌస్ సర్జన్ చదువుకునే రోజుల్లో కేఎంసీలో అప్తమాలాజిస్టుగా చేసిన నాగార్జునసాగర్‌కు చెందిన సి.కృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అప్పుడే నా పేరు కృష్ణవేణిగా మార్చుకున్నా. ఇప్పుడు ఆయన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. నాకు పిల్లలు అయేషా, ముజీబ్ ఉన్నారు. బీఎస్సీ నర్సింగ్ అయిపోగానే హైదరాబాద్ పురానీ హవేలీలోని ముస్లిం మెటర్నిటీ ఆస్పత్రిలో 1990 నుంచి 92 వరకు పనిచేశాను. ఇప్పుడు ఆ ఆస్పత్రిని చాదర్‌ఘాట్‌లోని బేకర్హౌజు, కమల్ థియేటర్ సమీపంలోకి మార్చారు. అక్కడ నేను పనిచేసిన సమయంలో నిఖత్, ఫర్వేజ్ ఫార్మాసిస్టులుగా ఉండేవారు. హుస్నా, అమీరా, బుస్వా సిస్టర్లుగా పనిచేసేవారు. రెహానా, ఫర్జానా, లతా మేడమ్ ఉండేవారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 1992 నుంచి 95 వరకు పనిచేస్తున్నప్పుడు వరంగల్ గోవిందరాజులగుట్ట వద్ద ఉండేదానిని. చేర్యాలలో 1995 నుంచి 97 వరకు పనిచేశాను. తర్వాత డిప్యూటేషన్‌పై వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలోనూ పనిచేశాను. అపుడు జెమిని థియేటర్ సమీపంలో ఉండేదానిని. నేను కేఎంసీ లో చదువుతున్నపుడు రోజ్లిన్, మధులిక, సుదేష్ణ నా కొలీగ్స్. రోజ్లిన్ ఈఎన్టీ సర్జన్ అశోక్‌రెడ్డి భార్య. నాకు వరంగల్‌లోని కొందరు డాక్టర్లు కూడా తెలుసు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి, బైంసాలోని పీహెచ్‌సీల్లో సీనియర్ నర్సుగా పనిచేశాను.’ అని తన వివరాలు పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చిన ఆమె తాను ఇక్కడికి ఎలా వచ్చింది.. ఎందుకు వచ్చిందనే విషయూలు మాత్రం స్ప ష్టంగా చె ప్పలేకపోతోంది. వచ్చిన కొత్తలో పిచ్చిదానిలా ప్రవర్తించేదని, ఎవరో వస్తున్నట్లు వారిని దూషిస్తూ గట్టి గా అరిచేదని స్థానికులు తెలిపారు. కానీ రానురాను ఆమె మానసిక స్థితి కుదుటపడినట్లుగా చెప్పారు. ఇప్పుడు అందరితో మంచిగానే మాట్లాడుతోందన్నారు. అలాగే ఎవరినీ చేరుు చాపి అడుక్కోదని, ఎవరైనా అన్నం పెడితినే తింటుందని చెప్పారు. కాగా స్థానికులు ఆరోగ్య సమస్యలుండి ఆమె వద్దకు వెళితే మందులు రాసిస్తోంది. వాటిని స్థానిక వైద్యులకు చూపిస్తే సరియైనవేనని ధ్రువీకరిస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న ఆమె ఇలా మతిస్థిమితం కోల్పోరుు ఇక్కడికి ఎందుకు వచ్చిందో మాత్రం తెలియడం లేదు. ఈమెను బంధువులు గుర్తించి తీసుకెళ్లేలా చూడాలని, లేదంటే అనాథ శరణాలయం వారు చేర దీయూలని స్థానికులు కోరుతున్నారు.