రైలుబండిలో ప్రసవం | Women Delivery In Secunderabad-Visakhapatnam Duranto Train | Sakshi
Sakshi News home page

రైలుబండిలో ప్రసవం

Published Wed, Sep 14 2022 4:58 AM | Last Updated on Wed, Sep 14 2022 12:22 PM

Women Delivery In Secunderabad-Visakhapatnam Duranto Train - Sakshi

సత్యవతిని పరీక్షిస్తున్న డాక్టర్‌ స్వాతిరెడ్డి, బిడ్డతో సత్యవతి

అనకాపల్లి టౌన్‌: సికింద్రాబాద్‌–విశాఖ దురంతో రైల్లో పండంటి ఆడ శిశువుకు ఓ తల్లి జన్మనిచ్చింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నాంకు చెందిన పి.సత్యవతి.. భర్త సత్యనారాయణతో కలిసి బీ–6 ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న సత్యనారాయణ భార్యను డెలివరీ నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళుతున్నారు. సోమవారం సాయంత్రం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైలెక్కారు.

మంగళవారం వేకువజామున రైలు రాజమండ్రి స్టేషన్‌ దాటుతుండగా సత్యవతికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. సత్యనారాయణ టికెట్‌ కలెక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అనకాపల్లిలో రైలు ఆపేందుకు చర్యలు చేపట్టారు. ఇంతలో నొప్పులు మరింత పెరిగాయి. దీంతో అదే బోగీలో ప్రయాణిస్తున్న హౌస్‌సర్జన్‌ స్వాతిరెడ్డి అదే బోగీలో ప్రయాణిస్తున్న మహిళల సాయంతో సుఖప్రసవం చేశారు. ఈలోగా రైలు అనకాపల్లి రైల్వేస్టేషన్‌ చేరుకుంది. 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement