డాక్టర్ కృష్ణవేణి కేరాఫ్ రైల్వే ప్లాట్‌ఫామ్ | Dr. Krishna veni c / o Railway Platform | Sakshi
Sakshi News home page

డాక్టర్ కృష్ణవేణి కేరాఫ్ రైల్వే ప్లాట్‌ఫామ్

Published Mon, Mar 31 2014 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM

డాక్టర్ కృష్ణవేణి కేరాఫ్ రైల్వే ప్లాట్‌ఫామ్

డాక్టర్ కృష్ణవేణి కేరాఫ్ రైల్వే ప్లాట్‌ఫామ్

సంగెం, న్యూస్‌లైన్ :  ‘నా పేరు సయ్యద్ అమీర్ ఎక్బాల్ బేగం. తండ్రి ఎక్బాల్ హుస్సేన్ దుబాయిలో ఉంటాడు. నన్ను పెంచిన సయ్యద్ జాఫీర్ అలీ మీర్జా ఎయిర్ కండిషన్ ఇంజినీర్. జూబ్లీహిల్స్ ప్లాట్ నంబర్ 17, హైదరాబాద్, ఎల్‌వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ దగ్గర మా ఇల్లు. స్కూల్ చదువంతా కొత్తగూడెంలో పూర్తి చేశా. బీఎస్సీ నర్సింగ్ సోమాజిగూడలో, ఎంబీబీఎస్ కేఎంసీలో, డీజీఓ సిద్దార్థ కాలేజీ విజయవాడలో చదివాను. వీటీతోపాటు లోయర్, హయ్యర్ టైప్, డీబీహెచ్‌పీ కోర్సు పూర్తి చేశాను.
 
నేను మస్లిం అయినా హౌస్ సర్జన్ చదువుకునే రోజుల్లో కేఎంసీలో అప్తమాలాజిస్టుగా చేసిన నాగార్జునసాగర్‌కు చెందిన సి.కృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అప్పుడే  నా పేరు కృష్ణవేణిగా మార్చుకున్నా. ఇప్పుడు ఆయన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. నాకు పిల్లలు అయేషా, ముజీబ్ ఉన్నారు.
 
బీఎస్సీ నర్సింగ్ అయిపోగానే హైదరాబాద్ పురానీ హవేలీలోని ముస్లిం మెటర్నిటీ ఆస్పత్రిలో 1990 నుంచి 92 వరకు పనిచేశాను. ఇప్పుడు ఆ ఆస్పత్రిని చాదర్‌ఘాట్‌లోని బేకర్‌హౌజు, కమల్ థియేటర్ సమీపంలోకి మార్చారు. అక్కడ నేను పనిచేసిన సమయంలో నిఖత్, ఫర్వేజ్ ఫార్మాసిస్టులుగా ఉండేవారు. హుస్నా, అమీరా, బుస్వా సిస్టర్లుగా పనిచేసేవారు. రెహానా, ఫర్జానా, లతా మేడమ్ ఉండేవారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 1992 నుంచి 95 వరకు పనిచేస్తున్నప్పుడు వరంగల్ గోవిందరాజులగుట్ట వద్ద ఉండేదానిని. చేర్యాలలో 1995 నుంచి 97 వరకు పనిచేశాను.
 
తర్వాత డిప్యూటేషన్‌పై వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలోనూ పనిచేశాను. అపుడు జెమిని థియేటర్ సమీపంలో ఉండేదానిని. నేను కేఎంసీ లో చదువుతున్నపుడు రోజ్‌లిన్, మధులిక, సుదేష్ణ నా కొలీగ్స్. రోజ్‌లిన్ ఈఎన్‌టీ సర్జన్ అశోక్‌రెడ్డి భార్య. నాకు వరంగల్‌లోని కొందరు డాక్టర్లు కూడా తెలుసు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి, బైంసాలోని పీహెచ్‌సీల్లో సీనియర్ నర్సుగా పనిచేశాను.’ అని  తన వివరాలు పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చిన ఆమె తాను ఇక్కడికి ఎలా వచ్చింది.. ఎందుకు వచ్చిందనే విషయూలు మాత్రం స్ప ష్టంగా చె ప్పలేకపోతోంది.
 
 వచ్చిన కొత్తలో పిచ్చిదానిలా ప్రవర్తించేదని, ఎవరో వస్తున్నట్లు వారిని దూషిస్తూ గట్టి గా అరిచేదని స్థానికులు తెలిపారు. కానీ రానురాను ఆమె మానసిక స్థితి కుదుటపడినట్లుగా చెప్పారు. ఇప్పుడు అందరితో మంచిగానే మాట్లాడుతోందన్నారు. అలాగే ఎవరినీ చేరుు చాపి అడుక్కోదని, ఎవరైనా అన్నం పెడితినే తింటుందని చెప్పారు. కాగా స్థానికులు ఆరోగ్య సమస్యలుండి ఆమె వద్దకు వెళితే మందులు రాసిస్తోంది.
 
వాటిని స్థానిక వైద్యులకు చూపిస్తే సరియైనవేనని ధ్రువీకరిస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న ఆమె ఇలా మతిస్థిమితం కోల్పోరుు ఇక్కడికి ఎందుకు వచ్చిందో మాత్రం తెలియడం లేదు. ఈమెను బంధువులు గుర్తించి తీసుకెళ్లేలా చూడాలని, లేదంటే అనాథ శరణాలయం వారు చేర దీయూలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement