సరదా స్నేహాలు.. విపరీత అనర్థాలకు దారితీస్తున్నాయి. యుక్తవయసులో తెలిసీ తెలియక చేస్తున్న పనులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆకర్షణతో ఒకరికపై ఒకరు పెంచుకుంటున్న ‘ప్రేమ’ అనే ఫీలింగ్.. చివరకు విషాదాన్ని మిగులుస్తోంది. కేరళలో జరిగిన మానస హత్య ఘటన ‘ప్రేమోన్మాదం’ చర్చను మరోసారి తెర మీదకు తెచ్చింది.
కొచ్చి: Dental Hose Surgeon మానస హత్య కేసు ప్రస్తుతం కేరళను కుదిపేస్తోంది. పట్టపగలే ఇంట్లోకి చొరబడి మరీ మానసను తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు.. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు.. మరిన్ని వివరాలను సేకరించారు. కొచ్చికి 35 కిలోమీటర్ల దూరంలో కొత్తమంగళం దగ్గర నెల్లికులిలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఇదసలు ప్రేమా? ఉన్మాదమా? అనే అంశంపై యువతలో సోషల్ మీడియాలో, ముఖ్యంగా క్లబ్‌హౌజ్‌లో ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది.
బ్రేకప్‌కి ఏడాది
పీవీ మానస(24) స్వస్థలం కన్నూర్. ఇందిరా గాంధీ కాలేజీలో డెంటల్ కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతోంది. అక్కడే స్నేహితురాల్లతో రూమ్‌లో ఉంటోంది. ఇక రాఖిల్(32?) కూడా అదే జిల్లాకు చెందిన వాడు. ఏడాది క్రితం ఈ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. ఆపై ప్రేమలో పడ్డారు. అయితే నెల క్రితం మానస, రాఖిల్‌కు బ్రేకప్ చెప్పింది. దీంతో రాఖిల్ ఆమెను బతిమాలడం మొదలుపెట్టాడు. కాళ్ల మీద పడ్డాడు. ఈ విషయంపై కన్నూర్ పోలీస్ స్టేషన్‌లో మానస ‘వేధింపుల ఫిర్యాదు’ చేసింది. ఈ ఫిర్యాదుపై పోలీస్ పంచాయితీ జరగ్గా.. రాఖిల్ పేరెంట్స్ రిక్వెస్ట్‌తో బెదిరించి వదిలేశారు పోలీసులు. దీంతో తన బ్రేకప్ కథకు ముగింపు పలకాలని పక్కా ఫ్లాన్ వేసుకున్నాడు.
దగ్గరగా కాల్పులు
శుక్రవారం మధ్యాహ్నం కొత్తమంగళంలో మానస ఉంటున్న రూమ్‌కి వెళ్లాడు. ఆమెతో గొడవకు దిగి.. మరో రూంలోకి లాక్కెళ్లాడు. రూమ్ మేట్స్ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వాళ్లను తుపాకీతో బెదిరించి ఆపై మానసపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో కేరళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈమధ్య వరుసగా వరకట్న మరణాలు చోటు చేసుకోడం, అవి మరిచిపోక ముందే మానస ఘటన చోటు చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాఖిల్‌కు తుపాకీ ఎలా దొరికిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment