‘వన్-బీ’ని పటిష్టంగా అమలు చేయాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమాచార హక్కు చట్టం వన్-బీని పటిష్టంగా అమలు చేయాలని ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ వి.వెంకటేశ్వర్లు జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో సమాచారహక్కు చట్టం అమలుతీరును ఆయన సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వన్-బీ వివరాల ఏర్పాటుతోపాటు సమాచార చట్టం ద్వారా అడిగిన అధికారి హోదా, పేరు తదితర వివరాలను తెలుగులో అందించాలన్నారు.
మెరుగైన సమాజం కోసం రూపొందించిన సమాచారహక్కు చట్టం ఉద్దేశాన్ని అర్థం చేసుకుని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రజా సమాచార అధికారులుగా పనిచేస్తున్న వారికి ఆర్టీఐ చట్టం గురించి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా అవగాహన తరగతులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో ప్రజా సమాచార అధికారుల ఇబ్బందులను సానుకూల దృక్పథంతో చూస్తున్నట్లు చెప్పారు. ఈ చట్టాన్ని పారదర్శక పాలన కోసం ప్రభుత్వం రూపొందిం చిందని వివరించారు.
గ్రామస్థాయి వివరాలను కూడా అందించేందుకు శాఖల వారీగా డేటాబేస్‌ను రూపొందిస్తామని కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ తెలిపారు. ప్రధానమైన 31 శాఖలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద వచ్చిన 1,611 దరఖాస్తులలో 1,131 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. పోలీస్‌శాఖకు 54 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనాథ్ చెప్పారు. వీటిలో 39 సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. మిగిలిన వాటికి కూడా సకాలంలో సమాచారం కూలీ డబ్బు కూడా అందకపోవడంతో రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పస్తులతో అలమటిస్తున్నామని కూలీలు అధికారులతో మొర పెట్టుకుంటున్నా మేము చేసేదేమీ లేదని వారు చేతులెత్తేశారు.
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 5,77,053 వేల మంది శ్రామికులు జాబ్ కార్డు కలిగి ఉన్నారు. పనుల కల్పనకు ప్రభుత్వం శ్రమశక్తి గ్రూపుల ఏర్పాటు తప్పనిసరి చేయడంతో వీరంతా 29,250 గ్రూపులుగా ఏర్పడి పనులు చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గత నెల నుంచి కూలీ డబ్బు చెల్లింపు నిలిచిపోయింది. గత నెల, ఈ నెల 23 వరకు కలిపి సుమారు 40 వేల మంది కూలీలకు 10 కోట్ల రూపాయలు వేతనంగా చెల్లించాలి. దీంతో పాటు ఆన్లైన్ ఎన్రోల్మెంట్ సమస్యవల్ల దీర్ఘకాలికంగా చెల్లించని వేతనాలు కలిపితే ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు కార్యాలయం జిల్లాలో మొత్తం కూలీలకు చెల్లించాల్సిన బకాయిల వివరాల సేకరణలో పడింది. కొన్ని మండలాల నుంచి ఇప్పటికే వివరాలు అందగా మరికొన్ని మండలాల నుంచి అందాల్సి ఉంది.
నిర్వీర్యమవుతున్న పంపిణీ వ్యవస్థలు..
ఉపాధి నిధులు సక్రమంగా ఖర్చు చేయడానికి, కూలీలకు డబ్బు చెల్లింపునకు ప్రభుత్వం పలు రకాలుగా పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇన్ని చేసినా సకాలంలో కూలీలకు డబ్బు అందడం లేదు. సాధారణ రోజుల్లో సైతం కూలీలకు వారానికోసారి వేతనం చెల్లింపు జరగడం లేదు. జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో తపాలాశాఖ, మరికొన్ని పంచాయతీల్లో బ్యాంకులు, ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా కూలీలకు వేతన పంపిణీ ఏర్పాట్లు జరిగాయి. వేతనాలు నేరుగా పంపిణీ చేసేందుకు బయోమెట్రిక్ పరిజ్ఞానంతో పనిచేసే స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. కూలీలకు వారానికోసారి వేతనాలు పంపిణీ చేయడానికి బ్యాంకులు జీరోమాస్‌లాంటి సంస్థలను సర్వీస్ ప్రొవైడర్లుగా ఏర్పాట్లు చేసుకున్నాయి.
ఇలా అంచెలంచెలుగా వ్యవస్థలు ఏర్పడినా కూలీలకు మాత్రం ఠంఛన్‌గా వేతనాలు అందించే లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ప్రధానంగా భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందులోని ఏజెన్సీ ప్రాంతాల్లో చేసిన పనికి సక్రమంగా వేతనం అందడం లేదని కూలీలు ఆందోళన చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. చేసిన పనికి సంబంధించి అధికారులు, కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండడంతో వాటి విచారణలకే ఉన్నతస్థాయి అధికారులు పరిమితమయ్యారు.. తప్ప కూలీల ఇబ్బందులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఈనెలలో కూడా వేతనం రాకుంటే తాము ఎలా బతకాలని మరోవైపు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.