కలర్‌ఫుల్.. క్వాయిష్
బంజారాహిల్స్: అంతర్జాతీయ ప్రఖ్యాతి చెందిన డిజైనర్లు ప్రత్యేకంగా రూపొందించిన చీరలు, దుస్తుల ప్రదర్శన ‘క్వాయిష్ డిజైనరీ ఎగ్జిబిషన్’ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో శుక్రవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డిజైనర్లు నీలం ఆశ్లే, జుబిన్ తమ కొత్త ఉత్పత్తులను ఇందులో అందుబాటులో ఉంచారు. ఆర్ట్ ఆన్ది ఫ్యాబ్రిక్ పేరుతో ఉక్రెయిన్‌కు చెందిన ఉష్యవంక డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శనివారం కూడా కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 70 మంది మాస్టర్ డిజైనర్లు కనువిందు చేసే దుస్తులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకా జ్యువెలరీ, షూస్, హోం ఫర్నిషింగ్స్, యాక్ససెరీస్, హోం డెకార్స్ కూడా ప్రదర్శనలో ఉన్నాయి.