dress materials
-
సాగరిక ఘట్జ్ హ్యాండ్ పెయింటింగ్ కళ్ళుతిప్పుకోలేరు.. (ఫోటోలు)
-
బాలిక స్కూల్ డ్రెస్‌పై అభ్యంతరం: తండ్రి ‘సోషల్’ నిరసన
ఒట్టావా: ఓ మైనర్ విద్యార్థిని దుస్తులు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని ఆరోపించి బాలికను ఇంటికి పంపించిన ఘటన కెనడాలో చోటు చేసుకుంది. దీనిపై ఆమె తండ్రి ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాడు. అంతేగాక తనకు, తన కూతురికి మద్దతుగా నిలవాలంటూ సోషల్ మీడయాలో పోస్టు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాలు.. కెనడాలోని నోర్కమ్ సీనియర్ సెకండరీ స్కూల్లో క్యారిస్ అనే విద్యార్థిని చదువుతోంది. ఈ క్రమంలో ఆమె ఇటీవల వైట్ ఫుల్ లెన్త్ స్లీవ్, పొడవాటి నెక్ షర్ట్‌పై బ్లాక్ సింగిల్ స్ట్రీప్, మెకాలి పోడవు ఉన్న లేస్ టాప్ ధరించి స్కూల్‌కు వెళ్లింది. దీంతో క్లాస్‌లో ఓ మహిళా ఉపాధ్యాయురాలు తన మిగతా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించేల ఉందని, పాఠాలు చెప్పే సమయంలో ఉపాధ్యాయులంతా ఏకాగ్రత కోల్పోయే విధంగా తన ఆమె దుస్తులు ఉన్నాయని విద్యార్థినితో పేర్కొంది. అంతేగాక క్యారిస్నున స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకుని వెళ్లడంతో, ప్రిన్సిపల్ కూడా ఉపాధ్యాయురాలికి మద్దుతు పలికారు. క్యారిస్ దుస్తులు లోదుస్తులను తలపించేలా ఉన్నాయని, ఇలాంటి దుస్తులను బహిష్కరించాలన్నారు. అంతేగాక క్యారిస్ను ఇంటికి పంపిచామని చెప్పారు. ప్రిన్సిపల్ చెప్పడంతో బాలికను పాఠశాల యాజమాన్యం తిరిగి ఇంటికి పంపించేసింది. ఇంటికి వెళ్లాక జరిగిన విషయాన్ని బాలిక తన తండ్రి క్రిస్టోపర్ విల్సన్‌కు వివరించింది. దీంతో అతడు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను తన కూతురిని అవమానించారని స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాడు. అంతేగాక ఆ మరుసటి రోజు క్యారిస్ తోటి విద్యార్థులంతా మద్దతు పలుకుతూ క్లాస్ రూం నుంచి వాకౌట్ చేశారు. ఇక క్యారిస్ తండ్రి విల్సన్ ‘ఇవాళ నా కూతురిని స్కూలు నుంచి ఇంటికి పంపించారు. తన డ్రెస్ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని ఆరోపించారు. దీనిని నేను వ్యతిరేకిస్తున్నాను. దయచేసిన నాకు, నా కూతురికి మద్దుతుగా నిలిచి ఇలాంటి ఘటనలు మరోసారి పునరావుతం కాకుండా చేస్తారని ఆశిస్తున్నాను’ అంటూ ఫేస్బుక్లో పోస్టు చేశాడు. అంతేగాక ఈ విషయం తనను బాధించిందని, 2021లో కూడా ఇలా జరగడంపై తాను నిరాశకు గురయ్యానని పేర్కొన్నాడు. ఈ దీనికి కారణమైన స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్లు పాఠశాల సూపరెండెంట్ విల్సన్‌తో పేర్కొన్నట్లు తెలిపాడు. -
ఆప్కో..తీస్కోదేం?
రామన్నపేట, న్యూస్‌లైన్ : చేనేత వస్త్రాల ఉత్పత్తికి జిల్లా ప్రసిద్ధి. ఇక్కడ తయారైన డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లు, మెర్స్రైజ్డ్(మస్స్) చీరలు, దోవతులు ప్రపంచ వ్యాప్త్తంగా ప్రాచుర్యం పొందాయి. పోచంపల్లి చీరలు జిల్లాకే తలమానికంగా నిలిచాయి. అలాంటి చేనేత పరిశ్రమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఆప్కో ఆరునెలల నుంచి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో జిల్లాలోని దాదాపు అన్ని చేనేత సహకార సంఘాల్లో కోట్లాది రూపాయల విలువైన వస్త్రాలు మూలుగుతున్నాయి. గత జూన్‌లో కొనుగోలు చేసిన వస్త్రాలకు ఇప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో నేతన్నలు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్లాలో 42 కాటన్, 30 సిల్క్చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 25వేల మంది సభ్యులుగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా సహకార రంగంలో 13వేలు, సహకారేతర రంగంలో 10వేలకుపైగా మగ్గాలు నడుస్తున్నాయి. కార్మికులు నేసిన వస్త్రాలను సొసైటీలు కొనుగోలు చేసి ఆప్కో ద్వారా విక్రయిస్తారు. రూ.ఏడుకోట్లకు పైగా విలువైన వస ్తన్రిల్వలు జూన్, జూలై మాసాల్లో ఆప్కో వారు చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఆరు నెలలుగా కొనుగోళ్లు జరపకపోవడంతో కేవలం చేనేత సహకార సంఘాల్లోనే రూ.7కోట్ల మేర వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. ప్రధానంగా పోచంపల్లి, కొయ్యలగూడంలలో రూ.కోటి, సిరిపురంలో రూ.90లక్షలు, చౌటుప్పల్‌లో రూ.50 లక్షలు. గట్టుప్పల్‌లో రూ.70లక్షలు, బోగారంలో రూ.10లక్షలు, వెల్లంకిలోరూ. 20లక్షలు, కుంట్లగూడెంలో రూ.25లక్షలు, వెలువర్తిలో రూ.10లక్షలు, గుండాలలో రూ.20లక్షలు, మోత్కూరులో రూ.20లక్షలు, పల్లెర్లలో రూ.30లక్షలు, నకిరేకల్లోరూ.10లక్షల విలువైన వస్త్ర నిల్వఉన్నాయి. అప్పుల్లో కూరుకుపోతున్న నేతన్నలు బిల్లులు సకాలంలో రాకపోవడంతో నేతకార్మికులు అప్పులపాలవుతున్నారు. వస్త్రాల ఉత్పత్తికి అవసరమయ్యే నూలు, రంగులు కొనుగోలు కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. కుటుంబ పోషణ కోసం, పెట్టుబడుల కోసం కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. బ్యాంకు రుణాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. దీంతో నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వస్త్రాలు కొనుగోలు చేయాలి : అప్పం రామేశ్వరం, అధ్యక్షుడు, సిరిపురం చేనేతసహకారసంఘం చేనేత సహకార సంఘాల్లో నిల్వ ఉన్న వస్త్రాలను ఆప్కోవారు వెంటనే కొనుగోలు చేయాలి. గతంలో కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలి. లేకుంటే కార్మికులు, సహకార సంఘాలు అప్పులపాలయ్యే ప్రమాదం ఉంది.