ఎండిన పంటలకు పరిహారం అందించాలి
పంటలను పరిశీలించిన తెలంగాణ రైతు సంఘం
జనగామ : వర్షాభావ పరిస్థితుల్లో ఖరీ ఫ్లో రైతులు సాగు చేసిన ఎండిన పం టలకు ప్రభుత్వం పరిహారం అందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంత చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని వడ్లకొండ, గానుగుపహాడ్, మరిగడి, చౌడారం గ్రామాల్లో ఆదివారం రైతు సంఘం బృందం ఎండిన పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రోజులుగా వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, పెసర, సోయ, నువ్వు లు, బొబ్బెర పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు.
ప్రభుత్వం రెవెన్యూ అధికారులచే ఎండిన పంటలను ఎన్యుమరేషన్ చేయించి, ఎకరాకు రూ.30వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు ఖర్చు చేస్తుందన్నారు. ప్రతిఏటా ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే విధంగా ఉన్న పరిస్థితుల్లో, దిగుమతి చేసుకునే దుస్థితికి దిగజారామన్నారు. మోకు కనకారెడ్డి, సాదం జంపన్న, రమావత్ మిట్యానాయక్, సికిందర్, కొమురయ్య, సత్తెయ్య, రాజు, శ్రీరాములు, బోడరాములు, సిద్దులు, రా ములు, దుర్గాప్రసాద్, ఎల్లయ్య ఉన్నారు.