‘డిఫ్ట్రానిక్స్– 2017’తో హైదరాబాద్‌కు గుర్తింపు
సైయింట్ ఎగ్జిక్యూటివ్
చైర్మన్ మోహన్‌రెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్: రక్షణ రంగంలో ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించి ‘డిఫ్ట్రానిక్స్–2017’ పేరిట ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనున్న సదస్సు ద్వారా హైదరాబాద్‌కు మరింత గుర్తింపు వస్తుందని సైయింట్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారమిక్కడి జెనెక్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమికండక్టర్ అసొసియేషన్ (ఐఈఎస్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న డిఫ్ట్రానిక్స్–2017 సదస్సు ప్రాధాన్యాన్ని వివరించారు.
రక్షణ రంగంలో ఎలక్ట్రానిక్స్ యంత్రాల తయారీకి కేంద్రం డీపీపీ–16, బై ఇండియా, ఐడీడీఎం వంటి ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆచరణలో వృద్ధి సాధిస్తే ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కరమ్‌పురి మాట్లాడుతూ డిఫ్ట్రానిక్స్–2017లో తెలంగాణ ప్రభుత్వం కంపెనీల స్థాపన కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తామని చెప్పారు.