Drilling process
-
Uttarkashi Tunnel: డ్రిల్లింగ్ పనులకు మళ్లీ ఆటంకం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో ఇంకొన్ని మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకోవచ్చన్న ఆశల నడుమ అనుకోని అవాంతరం ఎదురైంది. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్ మెషీన్ అమర్చిన ‘వేదిక’కు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్‌ను ఆపేశారు. బిగించిన వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్ మెషీన్ అటుఇటూ కదులుతూ కచి్చతమైన దిశలో డ్రిల్లింగ్ సాధ్యపడదు. అప్పుడు అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా డ్రిల్లింగ్‌ను ఆపేశారు. ‘ మరికొన్ని గంటల్లో లేదా రేపటి కల్లా ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తవుతుంది’ అని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నయిన్ గురువారం సాయంత్రం చెప్పారు. ‘మనం చేస్తున్నది యుద్ధంలాంటిదే. ఖచి్చతంగా ఫలానా సమయంలోగా ఈ ఆపరేషన్ పూర్తిచేసి అందర్నీ బయటకు తెస్తామని ముందుగానే జోస్యం చెప్పడం సరైన విధానం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సభ్యులు సొరంగం వద్దే ఉండి, లోపలున్న కారి్మకులను బయటకు తీసుకువచ్చే విషయంలో రిహార్సల్ చేస్తున్నారని హస్నయిన్ తెలిపారు. కారి్మకులను బయటకు తీసుకొచ్చే క్రమంలో అనుకోని విధంగా కాల హరణం జరుగుతున్నందున సమాంతర డ్రిల్లింగ్‌లో అనుకోని అవాంతరాలు ఎదురైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టామన్నారు. ఇందుకోసం అదనంగా యంత్రాలను తెప్పిస్తున్నామని వివరించారు. బార్కోట్ వైపు నుంచి డ్రిల్లింగ్ పనులను 9.10 మీటర్ల మేర పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు. డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న టన్నెల్ ప్రాంతం -
కేజీ బేసిన్.. చమురు నిక్షేపాలు దొరికెన్!
నరసాపురం: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో చమురు నిక్షేపాల కోసం ప్రభుత్వరంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) అధికారులు రెండేళ్లుగా చేస్తున్న అన్వేషణ సత్ఫలితాలనిచ్చింది. తాజాగా చమురు నిక్షేపాల కోసం అధికారులు వేగం పెంచి విస్తృతంగా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగుచోట్ల అపారంగా గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కొత్త బావులు కావడం విశేషం. ఇప్పటికే రెండుచోట్ల సర్వే డ్రిల్లింగ్ పనులు పూర్తి చేశారు. మిగిలిన రెండు చోట్ల కూడా గ్యాస్ వెలికితీతకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేజీ బేసిన్ పరిధిలో నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా తవ్వుతున్న బావులు ఖాళీ అయ్యాయి. దీంతో ఉత్పత్తిని పెంచేందుకు ఓఎన్జీసీ రెండేళ్ల నుంచి నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి, మార్టేరు, పెనుగొండ, భీమవరం ప్రాంతాల్లో అన్వేషణ ప్రారంభించింది. మార్టేరు, పెనుగొండ ప్రాంతాల్లో పెద్దస్థాయిలో, మొగల్తూరు మండలం ఆకెనవారితోట, భీమవరం సమీపంలోని మహాదేవపట్నం, వేండ్ర వద్ద మొత్తం నాలుగుచోట్ల చమురు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించి, వెలికితీతకు ఉపక్రమించారు. నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు నాలుగు దశాబ్దాలుగా నరసాపురం కేంద్రంగా ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే మూడు దశాబ్దాల పాటు ఓఎన్జీసీ కేవలం ఆన్షోర్పైనే దృష్టి పెట్టింది. రిలయన్స్, గెయిల్ వంటి ప్రైవేట్ ఆయిల్‌రంగ సంస్థలు రంగప్రవేశం చేయడంతో వాటి పోటీని తట్టుకోవడానికి ఓఎన్జీసీ 2006 నుంచి సముద్రగర్భంలో అన్వేషణలపై దృష్టి సారించింది. ప్రస్తుతం నరసాపురం నుంచి కాకినాడ వరకు సముద్రగర్భంలో డ్రిల్లింగ్ జరుగుతోంది. నరసాపురం మండలం చినమైనవానిలంక తీరానికి సమీపంగా సముద్రగర్భంలో గ్యాస్ వెలికితీత ప్రారంభమైంది. అదనపు ఉత్పత్తిలో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓఎన్జీసీ ప్రస్తుతం ఇదే ప్రధాన వనరుగా భావిస్తోంది. ఆన్‌షోర్‌కు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాలో కవిటం, నాగిడిపాలెం, ఎస్–1 వశిష్టాబ్లాక్, 98–2 ప్రాజెక్ట్‌లో, తూర్పుగోదావరి జిల్లా కేశనపల్లి, కృష్ణా జిల్లా బంటుమిల్లి, నాగాయలంక ప్రాంతాల్లో గత కొంతకాలంగా చేపట్టిన అన్వేషణలు పూర్తయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లో వీటి ద్వారా ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఓఎన్జీసీ అధికారులు చెపుతున్నారు. 25 శాతం ఉత్పత్తి పెంపు లక్ష్యంగా.. రానున్న ఏడాది మరో 25 శాతం ఉత్పత్తి పెంపు కోసం ఓఎన్జీసీ ప్రయత్నాలు సాగిస్తోంది. రోజుకు 35 నుంచి 40 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 1,400 టన్నుల ఆయిల్ వెలికితీయడమే లక్ష్యంగా ముందుకెళుతోంది. గ్యాస్ వెలికితీతలో ఇప్పటికే దేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఓఎన్జీసీ.. ఇదే దూకుడుతో లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆఫ్‌షోర్ (సముద్రగర్భం)లో అన్వేషణలకు సంబంధించి నరసాపురం తీరంలో చురుగ్గా కార్యకలాపాలు సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాదే అగ్రస్థానం కొత్తగా జిల్లాలో కనుగొన్న బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైతే, రోజుకు ఇక్కడి నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ వెలికితీయవచ్చని ఓఎన్జీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేజీ బేసిన్లో ఓఎన్జీసీ రోజుకు 33 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 900 టన్నుల ఆయిల్‌ను వెలికితీస్తోంది. ఇందులో పశ్చిమగోదావరి జిల్లా నుంచే రోజుకు 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కొత్త బావుల ద్వారా మరో 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ఇక్కడి నుంచి పెరిగితే ఈ జిల్లాదే అగ్రస్థానం అవుతుంది. -
‘బయ్యారం’ ఖనిజాన్వేషణ ప్రైవేటుకు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలో ముడి ఇనుప ఖనిజం అన్వేషణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల పరిధిలోని ఖనిజ నిల్వలను గతంలోనే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)కు అప్పగించా రు. ఈ నేపథ్యంలో ఖనిజాన్వేషణకు ప్రైవేటు ఏజెన్సీలను పారదర్శకంగా ఎంపిక చేయాల్సిన బాధ్యతను టీఎస్ఎండీసీకి అప్పగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ద్వారా ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు సెయిల్ ప్రతినిధులు ఖమ్మంలో పర్యటించి ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కనీసం 200 మిలియన్ టన్నుల ముడి సరుకు అవసరమని తేల్చారు. రాష్ట్రంలో 302 మిలియన్ టన్నుల ముడి ఇనుము నిల్వలు ఉన్నాయంటూ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక శాస్త్రీయంగా లేనందున 200 మిలియన్ టన్నుల ముడి ఇనుముపై పూర్తి నివేదిక ఇవ్వాలని సెయిల్ సూచించింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జీఎస్ఐతో సమన్వయం చేసుకుంటూ ముడి ఇనుము లభ్యతపై నివేదిక సిద్ధం చేసే బాధ్యతను ప్రభుత్వం గత ఫిబ్రవరిలో టీఎస్ఎండీసీకి అప్పగించింది. కొలిక్కిరాని ఖనిజాన్వేషణ ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దులోని బయ్యారంలో 100 చదరపు కి.మీ. పరిధిలో జీఎస్ఐ, గనులు, భూగర్భ వనరుల శాఖ సంయుక్త సర్వే నిర్వహించింది. లభ్యత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న 60 చ.కి.మీ. పరిధిలో 14 చోట్ల డ్రిల్లింగ్ చేసి ఖనిజం లభ్యతపై అంచనాకు రావాలి. డ్రిల్లింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో మూడుచోట్ల ఖనిజాన్వేషణ బాధ్యతను సింగరేణికి అప్పగించారు. మరోవైపు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల పరిధిలో మరో 12 చోట్ల డ్రిల్లింగ్ చేయాలని జీఎస్ఐ తాజాగా ప్రతిపాదించింది. ఇప్పటికే బయ్యారంలో జీఎస్ఐ, సింగరేణి డ్రిల్లింగ్‌ను సకాలంలో పూర్తి చేయలేనందున కొత్తగా ప్రతిపాదించిన 12 పాయింట్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇనుము లభ్యతపై స్పష్టత వస్తుందని టీఎస్ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి.