drilling riggs
-
Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ సొరంగంలో డ్రిల్లింగ్ నిలిపివేత
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని సిలి్కయారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు ఇంకా బయటకురాలేదు. వారం రోజుల క్రితం సొరంగం కూలిపోవడంతో వారు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కార్మికులు బయటకు రావడానికి వీలుగా ఎస్కేప్ మార్గాన్ని సిద్ధం చేయడానికి తలపెట్టిన డ్రిల్లింగ్ పనులను ఆదివారం నిలిపివేశారు. డ్రిల్లింగ్ యంత్రానికి అడ్డంకులు ఎదురు కావడమే ఇందుకు కారణం. గట్టి రాళ్లు రప్పలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం సమీక్షించారు. బాధితులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి భారీ డయామీటర్ స్టీల్ పైపులైన్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సొరంగం శిథిలాల గుండా ఈ పైపులైన్‌ను పంపించనున్నట్లు తెలిపారు. సొరంగంలో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవడానికి నిట్టనిలువుగా కంటే అడ్డంగా తవ్వడమే సరైందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా యంత్రానికి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుంటే రెండున్నర రోజుల్లో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవచ్చని వెల్లడించారు. సొరంగంలో కార్మికులు స్వేచ్ఛగా అటూ ఇటూ తిరగగలుగుతున్నారని, వారికి ఆహారం, నీరు, విద్యుత్, ఆక్సిజన్ అందుతున్నాయని, ప్రాణాపాయం లేదని నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు.అమెరికా యంత్రంతో అతిత్వరలో డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. సొరంగంలో ఉన్న కార్మికులకు మల్టీ విటమిన్ మాత్రలు, ఎండు ఫలాలు తదితరాలు అందిస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ఆదివారం తెలిపారు. -
ఓఎన్జీసీకి కాగ్ మొట్టికాయలు
రిగ్స్ నిర్వహణాలోపంవల్ల ఐదేళ్లలో రూ. 7,995 కోట్ల నష్టం వచ్చినట్లు నివేదిక న్యూఢిల్లీ: డ్రిల్లింగ్ రిగ్స్‌ను అద్దెకు తీసుకోవడం, వాటి నిర్వహణ, వినియోగం విషయంలో దేశంలో అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పాదక సంస్థ ఓఎన్జీసీ పేలవ పనితీరు ప్రదర్శించిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సీఏజీ-కాగ్) పేర్కొంది. దీనివల్ల రూ.7,995 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ నివేదిక ప్రకారం... వార్షికంగా రిగ్ అవసరాల ప్రణాళిక (ఆర్ఆర్పీ)ను సిద్ధం చేయడంలో సంస్థ తగిన ఏకీకృత విధానాన్ని అమలుచేయలేదు. రిగ్గుల రిపేరు, పునరుద్ధరణ ప్రణాళిక తగిన విధంగా లేదు. ఆయా అంశాల నేపథ్యంలో రిగ్ కొనుగోళ్లు, అద్దెకు తీసుకోవడం వంటి అంశాలు తగిన సమయానికి తగిన విధంగా జరగలేదు. 2010 నుంచి 2014 వరకూ రిగ్గులకు సంబంధించి ఉత్పత్తి జరగని సమయం 19% నుంచి 23% వరకూ ఉంది. దీని వల్ల దాదాపు రూ.6,418 కోట్ల నష్టం జరిగింది. రిగ్ కార్యకలాపాలకు సంబంధించి తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మరో రూ.1,577 కోట్ల నష్టం వచ్చింది. ఇదే కారణాల వల్ల నష్టం క్లెయిమ్‌ను బీమా సంస్థ తిరస్కరించిందని కాగ్ పేర్కొంది. 2010-14 మధ్య కంపెనీ డ్రిల్ చేసిన ప్రాంతాల్లో దాదాపు 33% ప్రణాళికాబద్ధంగా లేవు. 1867 ప్రాంతాల్లో డ్రిలింగ్ జరిపితే.. 615 ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా జరగలేదు.