భావన కేసులో కనిపించని పురోగతి
కొచ్చి: మలయాళ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో విచారణ కొనసాగుతున్నప్పటికీ పురోగతి కనిపించడం లేదు. ఈ ఉదంతానికి సూత్రధారిగా భావిస్తున్న పల్సర్ సునీల్‌తోపాటు పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.
అలాగే కుట్రకు సహకరించాడనే ఆరోపణలపై నటి డ్రైవర్ మార్టిన్ ను అరెస్టుచేశారు. షూటింగ్ ముగించుకొని వెళ్తున్న నటిని దుండగులు బలవంతంగా కారులో ఎక్కించుకొని వేధింపులకు గురి చేశారు. నిందితులు సునీల్‌తో సహా మరో ముగ్గురి ఆచూకీ కోసం అలప్పుజ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేసినా ఫలితం శూన్యం.